శునకాల ముక్కు మీద ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు?

by  |
శునకాల ముక్కు మీద ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు?
X

దిశ, వెబ్‌డెస్క్:

స్వల్ప ఉష్ణోగ్రత మార్పులను కూడా కనిపెట్టగలిగే ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు శునకాల ముక్కు చివరలో ఉంటాయని శాస్త్రవేత్తలు ఓ కొత్త పరిశోధనలో కనిపెట్టారు. స్వీడన్‌లోని లూండ్ యూనివర్సిటీ, హంగేరీలోని ఎట్వోస్ లోరండ్ యూనివర్సిటీ పరిశోధకులు దీని గురించి అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ద్వారా మాంసాహార జంతువులు తమ ఆహారాన్ని ఎలా వేటాడుతాయనే విషయాలను మరింత లోతుగా తెలుసుకునే అవకాశం కలగనుందని వారు అన్నారు.

నేచర్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైన వారి అధ్యయనంలో కుక్కల ముక్కు చివర్లో ఒక నరాల వ్యవస్థ ఉంటుందని, ఈ నాడీ వ్యవస్థ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల మాదిరి పనిచేస్తుందని పేర్కొన్నారు. వస్తువులు, జంతువులు, మనుషుల నుంచి వచ్చే థర్మల్ రేడియేషన్‌ని కుక్కలు గుర్తించి, అందుకు తగ్గట్టుగా వాటి ప్రవర్తనను మార్చుకుంటాయని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల్లో ఒకరైన ఆనా బాలింట్ తెలిపారు. శునకాన్ని చల్లని, వేడి వస్తువుల దగ్గర ఉంచినపుడు దాని మెదడులో ఏదైనా భాగం అధికంగా ప్రభావితమవుతోందా అనే కోణంలో వారు పరిశోధన చేశారు. తమ పరిసరాల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువు దగ్గరగా ఉన్నపుడు వాటి మెదడులో కణాలు ప్రభావితమయ్యాయని బ్రెయిన్ స్కాన్ నివేదికలు చూపించాయి.

ఈ క్రమంలోనే మిగతా మాంసాహార జంతువులకు కూడా ఇలాంటి ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు ఉండి ఉంటాయని, వాటిని అధ్యయనం చేయగలిగే ఆహారాన్ని వేటాడే విషయంలో కొత్తకోణం బయటపడుతుందని మరో శాస్త్రవేత్త రొనాల్డ్ క్రోగర్ వివరించారు.

tags: Dogs, Infrared Sensors, On tip of nose, sensors, nervous system, Brain scans, prey predator behaviour

Next Story

Most Viewed