వైద్యుల నిర్లక్ష్యం … 108 లో ప్రసవం

by  |
 వైద్యుల నిర్లక్ష్యం … 108 లో ప్రసవం
X

దిశ ప్రతినిధి, వరంగల్: ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం రోజు రోజుకు పెరుగుతుంది. జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ములుగు ఏరియా ఆసుపత్రి పట్ల రోగులు నమ్మకం కోల్పోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీలు చేయాలని చెప్పుతున్నప్పటికి గాను, వైద్యాధికారులు మాత్రం రోగులను పట్టించుకున్న పాపాన పోలేదు.

సోమవారం ములుగు జిల్లా బుట్టాయి గూడెం గ్రామానికి చెందిన కావిరి మౌనిక పురిటి నొప్పులు రావడంతో ములుగు ఏరియా ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఉదయాన్నే ఆమె ఆసుపత్రికి వచ్చినా వైద్యలు మాత్రం గర్భిణీ పట్టించుకోలేరు. దీంతో నొప్పులతో ఇబ్బందులు పడుతున్న తనని చూసి కుటుంబ సభ్యులు వైద్యలను ప్రాదేయపడినప్పటికి గాను నిర్లక్ష్యపు ధోరణిలో సమాధానం చెప్పారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ గర్భిణీ నొప్పులతో నరకయాతన అనుభవించింది. తన బాధ చూడలేక కుటుంబ సభ్యులు గర్భిణీ వరంగల్ ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలోనే 108 లో ప్రసవించింది. ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనివ్వగా తల్లి క్షేమంగా ఉన్నప్పటికి గాను, పిల్లల పరిస్థితి అనారోగ్యకరంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ములుగు ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed