రోగులకు కరోనా అంటించిన డాక్టర్.. రోగులు ఏం చేశారంటే?

by  |
రోగులకు కరోనా అంటించిన డాక్టర్.. రోగులు ఏం చేశారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: వైద్యుడు అంటే దైవం తర్వాత దైవం.. ఎంతమంది ప్రాణాలను కాపాడి దేవుడిగా పేరుతెచ్చుకునేవాడు. కానీ ఇక్కడ వైద్యుడు దైవంలా కాదు యముడిలా మారాడు. తనతో పాటు మరో 10 మంది రోగులకు రోగాలను తెప్పించి వారి ప్రాణాలకు ప్రాణసంకటంగా మారాడు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. గతం మాదిరే మళ్లీ రోజుకి లక్షకి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఏ ఈనేపథ్యంలో అందరు చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. కరోనా వస్తే హోమ్ క్వారెంటైన్ లో కి వెళ్లిపోవడంతో, ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడమో చేస్తూ ప్రాణాలను కాపాడుకోవాలని ఆరాటపడుతున్నారు. కానీ నిజామాబాద్ కి చెందిన నిష్కల్ ప్రభు అనే డాక్టర్ మాత్రం రోగులకు కరోనా అంటించాడు.

నిజామాబాద్ లో నిష్కల్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని నిష్కల్ ప్రభు నడిపిస్తున్నాడు. అయితే గత కొద్దీ రోజుల క్రితం నిష్కల్ ప్రభు కరోనా బారిన పడ్డాడు. అయితే ఆ విషయాన్ని దాచి రోజు హాస్పిటల్ కి వచ్చి వైద్యం అందిస్తున్నాడు. కొంతమంది రోహులకు వైద్యుడిపై అనుమానం వచ్చి ఆరోగ్య అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటివరకు కూడా తనకు కరోనా లేదని, తాను టెస్ట్ చేయించుకోనని మనుకు పట్టు పట్టడంతో అధికారులు బలంతంగా అతనికి కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది . దీంతో వెంటనే అతను వైద్యం చేసిన రోగులకు, సిబ్బందికి టెస్ట్ చేయగా 30 మందిలో 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఘటనపై ఆరోగ్య అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed