మగవాళ్లను ప్రశ్నించరా.. సామ్ సంచలన కామెంట్

by  |
మగవాళ్లను ప్రశ్నించరా.. సామ్ సంచలన కామెంట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : టాలివుడ్ లవ్ కపుల్‌గా పేరు తెచ్చుకొని వివిధ కారణాలతో సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీనికి గల కారణాలపై వీరు ఇప్పటి వరకూ ఎలాంటి విషయం చెప్పలేదు. కానీ వీరి విడాకులకు గల కారణాలపై ఎవరికి తోచినట్లు వారు ఊహించుకుంటున్నారు. చైతు మాత్రం లవ్ స్టోరీ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుండగా.. సామ్ వివిధ అడ్వర్టైజ్ మెంట్లతో బిజీగా మారిపోయి అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో తనలోని బాధను చెప్పిచెప్పనట్టు పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే, తాజాగా సామ్ తన ఇన్ట్సాగ్రామ్ లో ఓ స్టోరీ పెట్టారు. ఇది తెగ వైరల్ అవుతోంది. “ఎప్పుడూ మహిళలనే ప్రశ్నించే ఈ సమాజం మగవాళ్లను మాత్రం ఎప్పుడూ ప్రశ్నించదు.. అలాంటప్పుడు మనకు ప్రాథమికంగా నైతికత లేనట్లే” అంటూ ఓ కొటేషన్‌ పెట్టి తన బాధను ఇన్‌స్టాలో పంచుకుంది.

Next Story

Most Viewed