కరోనా వ్యాక్సిన్‌పై పుకార్లు నమ్మవద్దు : కలెక్టర్

by  |
కరోనా వ్యాక్సిన్‌పై పుకార్లు నమ్మవద్దు : కలెక్టర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వ్యాక్సినేషన్‌పై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి కరోనా టీకా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌పై కొన్ని ప్రాంతాల్లో వాట్సాప్‌లలో పుకార్లు వస్తున్నాయని.. వాటిని నమ్మొద్దు అని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 10 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారని వారంతా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. వ్యాక్సినేషన్ రిలీజ్ కన్నా ముందే.. అప్పటికే టీకా విషయంలో అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వ్యాక్సిన్‌ను రిలీజ్ చేస్తారని అన్నారు.

అందుకే అందరూ వ్యాక్సిన్ తీసుకొని 100% వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని కోరారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వారి, తీసుకోని వారి మ్యాన్యువల్ లిస్ట్ ఉండాలన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు కొవిన్ యాప్‌లో ఎంట్రీ చేయాలన్నారు. వ్యాక్సిన్ విషయంలో అధికారులు గట్టిగా ఫోకస్ చేయాలన్నారు. రూరల్ ఏరియాలో ఉన్న పెండింగ్స్ పూర్తి చేయాలన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి డీటెయిల్స్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు.

డోర్ టు డోర్, నేమ్‌తో సహా వ్యాక్సిన్ తీసుకున్న వారి లిస్ట్ మెడికల్ ఆఫీసర్, ఆశ, ఏఎన్ఎం చెక్ చేసుకోవాలని తెలిపారు. అవసరమున్న చోట ఇతర శాఖల వారి సర్వీసును కూడా ఉపయోగించుకోవాలని డేటా కలెక్ట్ చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్, ట్రైనీ అదనపు కలెక్టర్ మకరంద్, జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్‌డీఓ చందర్ నాయక్, ఇన్చార్జి డీఎంహెచ్వో సుదర్శనం, డీపీఓ జయసుధ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed