‘ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదం’

by  |
‘ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదం’
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో రెండు వేరు వేరు చోట్ల బాణాసంచా ఫ్యాక్టరీల్లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే మదురై జిల్లాలో పేలిన ఘటనలో ఐదుగురు మహిళా కూలీలు చనిపోవడంతో డీఎంకే నేత స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ రెండు ప్రమాదాలను ఖండిస్తూ ఆయన ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ఇదే సమయంలో బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రతీ ఏటా పదుల సంఖ్యల్లో కూలీలు మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా పలుచోట్ల క్రాకర్స్ తయారు చేయడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రమాదానికి కారుకులైనా వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా స్టాలిన్ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed