ధాన్యంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.. రాష్ట్రమే కొనడం లేదు: డీకే అరుణ

by  |
ధాన్యంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.. రాష్ట్రమే కొనడం లేదు: డీకే అరుణ
X

దిశ, షాద్‎నగర్: ఎన్నికలు వచ్చినప్పుడే హామీలు ఇస్తూ, పథకాలు ప్రవేశ పెట్టడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పరిపాటిగా మారిందని.. అవసరం తీరాక బొడ మల్లన్న మాదిరిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో నియోజకవర్గ ఇన్‌చార్జీ ఎన్.శ్రీవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. లక్ష రూపాయల రుణమాఫీని కేసీఆర్ ప్రకటించి మూడు సంవత్సరాలు దాటుతున్నా ఇంకా ఆ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. వరి కొనుగోళ్లపై కేంద్రం స్పష్టతనిచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ధాన్యం కొనకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

Next Story