‘అధికార పార్టీ అయినా కేసులు నమోదు చేస్తాం’

by  |
‘అధికార పార్టీ అయినా కేసులు నమోదు చేస్తాం’
X

దిశ, హాలియా: ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనని ప్రభుత్వ నిభందనలు పాటంచకపోతే నాయకులకు పై కూడా కేసులు నమోదు చేస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డిఐజి రంగనాథ్ అన్నారు. బుధవారం హాలియాలో వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో, జిల్లాలో కరోనా విజృంభిస్తుంది. కరోనా నిబంధనలు అన్ని రాజకీయ పార్టీలు పాటించాలి అని సూచించారు. సీఎం బహిరంగ సభకు వచ్చేవారు డిస్టన్స్ తప్పనిసరిగా పాటించాలి, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని ఆయన పేర్కొన్నారు.

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అనుమానం ఉంటే టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. కొవిడ్కి సంభందించి ప్రభుత్వనిబంధనలు ఎవరు పాటించకపోయినా.. ఎటువంటి నాయకుడైనా సరే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కడైనా కనిపిస్తే వాటిని వెంటనే సీజ్ చేసి అదుపులోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు కోవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాటుచేయడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సభను ఎవరైనా అడ్డుకోవడానికి చూస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలకు నిబంధనలు వర్తిస్తాయని అన్నారు.

ఎవరిని ఎవరైనా ఇబ్బందులు పెట్టిన చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. 15వ తేదీ సాయంత్రం ఐదుగంటల లోపు గా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలని సూచించారు. లేనట్లయితే అట్టి వాహనాలను, ఆ పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల పైన కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. 17 వ తేదీన ఎన్నికలు ముగిసేవరకు ప్రతిఒక్కరు అధికారులను, ఉద్యోగులను ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. ఏ పార్టీకి చెందిన వారైనా కార్యకర్తలు, ఎవరు రెచ్చగొడితే రెచ్చిపోకండి తరువాత ఇబ్బందులు పడతారని, కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు కరోనా నిబంధనలు పాటించని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, టీఆర్ ఎస్ అభ్యర్ది భగత్ కుమార్ తో పాటు మరికొంతమంది పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. చట్టానికి వ్యతిరేకంగా అధికార పార్టీ అయిన నిబంధనలు అధికారమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.



Next Story