నైటీలో నాటు డ్యాన్స్ చేసిన ఆర్మీ ఆఫీసర్.. పద్ధతిగా ఉండాలంటున్న నెటిజన్లు

233

దిశ, సినిమా: బాలీవుడ్ నటి దిశా పటానీ సిస్టర్ ఖుష్బూ పటానీ మాస్ స్టెప్పులతో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ మేరకు బుధవారం బర్త్ డే పార్టీ చేసుకున్న ఖుష్బూ.. నైట్ పార్టీలో లైట్ పింక్ కలర్ నైటీలో డ్యాన్స్ చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసిన దిశ.. ‘హ్యాపీ బర్త్‌డే మై క్రేజీ సిస్‌, నాకూ నీలాగే డ్యాన్స్‌ చేయాలనుంది’ అంటూ రాసుకొచ్చింది. ఇక సల్మాన్‌, కత్రినా హిట్ సాంగ్‌ ‘లేజీ లాడ్‌’కు మత్తులో తేలుతూ ఖుష్బూ పటానీ లెగ్ షేక్ చేయగా..  ఫ్యాన్స్ సూపర్బ్ అంటుంటే.. కొంతమంది నెటిజన్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘తను ఓ ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మరిచిపోయిందా..? హీరోయిన్‌లాగా ఒళ్లు మరిచి డ్యాన్స్‌ చేస్తుంది’ అని కొందరు అంటుంటే.. ‘మేడం కొంచెం పద్ధతిగా ఉండండి. మీరొక బాధ్యత గల వృత్తిలో ఉన్నారు’ అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఖుష్బూ పటానీ ప్రస్తుతం ఇండియన్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది.

https://www.instagram.com/reel/CWruHiXoUgE/?utm_source=ig_web_copy_link

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..