మగువలకు ‘దిశ’ బంపర్ ఆఫర్.. ముగ్గు వేయండి.. బహుమతి గెలవండి

339
Rangoli

దిశ, వెబ్‌డెస్క్ : అతివల అంతరంగాన్ని ఆవిష్కరించేవి రంగవల్లులు. సంక్రాంతి వచ్చిందంటే ముంగిళ్లన్నీ రంగురంగుల ముగ్గులతో మెరిసిపోతాయి. తెలుగింటి మహిళా మణులను ఉత్తేజ పరచడం కోసం ‘దిశ’ ముందడుగు వేసింది. అందమైన ముగ్గులు వేసే వారికి ఆహ్వానం పలుకుతోంది. ముచ్చటగొలిపేలా ముగ్గు వేసే వారిని ప్రొత్సహిస్తోంది. మగువలు వేసిన ముగ్గు ఫొటోతోపాటు వారి ఫొటోను ‘దిశ’ ప్రచురిస్తోంది. పోటీలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు ఐదుగురికి ప్రోత్సాహక బహుమతులు అందజేయనుంది. మీ ఫొటోలను ఈ నెల 17వ తేదీ వరకు పంపొచ్చు.. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరూ మీ ఫొటోను పంపండి.. బహుమతి గెలుచుకోండి.. ఇప్పటికే ముగ్గుల పోటీకి వచ్చిన ఫొటోల కోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.

గమనిక…
ముగ్గుల ఫొటోలు పంపించేవారు, ముగ్గు పక్కనే మీరు నిలుచున్న ఫొటో, మీ ఊరిపేరు, మండలం పేరు, జిల్లా పేరుతో పాటు, మీ ఫోన్ నెంబర్ తప్పక పంపించగలరు.

ముంగిట్లో విరిసిన ముగ్గులు

https://epaper.dishadaily.com/m5/3350621/DISHA-MAIN/13-01-2022#page/4/1