నలు‘దిశ’లా సంచలనం.. నూతనోత్తేజంతో రెండో ఏడాదిలోకి అడుగు

by  |
నలు‘దిశ’లా సంచలనం.. నూతనోత్తేజంతో రెండో ఏడాదిలోకి అడుగు
X

‘నిజం వైపు మా పయనం..’ అంటూ ఎప్పటికప్పుడు నవ యవ్వనంతో దమ్మున్న వార్తలనే ప్రచురిస్తూ డిజిటల్ రంగంలో ‘దిశ’ దినపత్రిక దూసుకుపోతోంది. అన్నివర్గాల వారికి చేరువవుతూ మొదటి ఏడాది పూర్తిచేసుకుంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో నూతన కోణాలను ఆవిష్కరిస్తూ జనాల ముందుంచుతోంది. ట్రెండ్‌ను ఫాలో అవుతూ నిత్య నూతనంగా న్యూస్ ప్రెజెంట్ చేస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియాను మించిపోతోంది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ స్వార్థ పాలనలో ప్రజల కష్టాలేవైనా.. ఖద్దరు నేతల అవినీతి బాగోతాలెన్నున్నా.. అక్రమార్కుల బండారమేదైనా.. భూ కబ్జాలైనా.. బడా బాబుల మోసాలైనా.. అపన్న హస్తం కోసం అర్ధించడమైనా.. మిస్టరీ కథనాలైనా.. మానవీయ కోణాన్ని సృషించడమైనా.. సినిమా.. ఫ్యాషన్.. గేమ్స్.. ఇలా ఏదైనా నలు ‘దిశ’ల్లో తనకు సాటి ఎవరూ లేరనే విధంగా పత్రికా ప్రపంచంలో ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ఏడాది కాలంలో సాహసోపేతమైన కథనాలను ప్రజల ముందుంచి సంచలనాల దిశగా పేరుతెచ్చుకుంది.. మరింత ఉత్తేజం, ఉత్సాహంతో రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

దిశ ప్రతినిధి, ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ‘దిశ’ ఎన్నో సంచలనాత్మక కథనాలను ప్రజల ముందుంచింది. ఏ మెయిన్ స్ట్రీమ్ పత్రిక ప్రచురించలేని విషయాలను సైతం నిర్భయంగా సమాజానికి తెలిపింది. భద్రాద్రి రామాలయానికి సంబంధించి ఎన్నో సంచలనాత్మక విషయాలను బయటపెట్టింది. రామాలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.100కోట్లు కేటాయిస్తానని చెప్పి ఆరేళ్లుగా అటువైపుగా చూడని విషయాన్ని ‘రామయ్యను మరిచారా?’ కథనం పేరిట కూలకశంగా ప్రజల ముందుంచింది. రామయ్య పేరిట విదేశాలకు వెళ్లి అర్చకులు చేసే దోపిడీని ఆధారాలతో సహా నిరూపించగా.. ఇంటిలిజెన్స్ వర్గాలు సైతం ఆరాతీశాయి. రామయ్య పేరుపై జరిగే రగడ.. ఆలయంలో సిబ్బంది పాల్పడే మోసాలు ఇలా ప్రతి ఒక్కటీ నిర్భయంగా రాయగలిగింది.

ప్రజల పక్షాన నిలిచి..

ఇక బయ్యారం ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ గురించి ‘అంతులేని ఉక్కుకథ’ పేరిట ప్రచురితమైన కథనానికి అక్కడి గిరిజనులు నీరాజనాలు పలికారు. జనం గొంతుక మీరంటూ ఎలుగెత్తారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయడంపై కేంద్ర ప్రభుత్వ తీరును, పట్టింకోని రాష్ట్ర ప్రభుత్వాన్నీ ఎవరూ సాహసించని విధంగా దిశ ‘సింగరేణిని మింగే కుట్ర’ పేరిట నిలదీయడం పత్రికా ప్రపంచంలోనే సంచలనమైంది. అంతేకాదు సింగరేణి సోలార్ విద్యుత్ రంగంలోకి అడుగుపెడుతుండాన్ని ‘నల్లనేలపై సౌర వెలుగుల’ పేరిట ప్రశంసించింది. ఇంకా ఎన్నో కథనాలు ప్రచురించి అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందింది.

బెస్ట్ కథనాలు..

మావోయిస్టుల ప్రాబల్యం గల ప్రాంతం కాబట్టి.. ఆ ‘దిశ’గా చేసిన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఇటు పోలీసులను, అటు గిరిజనాన్ని అలర్ట్ చేస్తూ అందించిన ఎన్నో కథనాలు బెస్ట్‌గా నిలిచాయి. ‘మావోయిస్టుల బాణం బాంబు..’ పేరిట పంథా మార్చిన నక్సల్ సమాచారాన్ని చాలా విశ్లేషణాత్మకంగా అందించిన కథనం అన్ని వర్గాల్లో సంచలనాత్మకంగా మారింది. ఇక అక్రమార్కులకు సంబంధించి ఎన్నో కథనాలను దిశ అనేకసార్లు ప్రజల ముందుంచింది. ‘రూ. కోట్లలో గంజాయి దందా..’ సరిహద్దులు దాటుతున్న రేషన్ బియ్యం.. సాండ్ మాఫియా బరితెగింపుపై తెగించి మరీ కథనాలను ప్రపంచం ముందుంచడాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ప్రభుత్వ నిర్ణయాలైన ధరణి, ఎల్ఆర్ఎస్ వంటి వాటి వల్ల రియల్ రంగం కుదేలైంది. ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలు, ఇక భూ కబ్జాలకు సంబంధించిన విషయాలను ప్రజల ముందుంచడం కూడా దిశకు ఓ ప్రత్యేక స్థానాన్ని ఉంచింది. అంతేకాక ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని ఎక్కడిక్కడ నిగ్గుతేల్చి ప్రజల పక్షాన నిలిచింది. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల తరఫున పొట్లాడి ఎన్నో సమస్యలను పరిష్కారం చూపింది.

ప్రత్యేకం రాజకీయం..

ఇక రాజకీయాల్లో ఎవరూ సాహసించని విధంగా.. ప్రమాదం ఉంటుందని తెలిసీ సంచలనాత్మక కథనాలను ప్రచురించింది.. ఈ సాహసమే ఇప్పుడు ‘సంచాలనాల దిశ’గా పేరుతెచ్చుకుంది. పార్టీల్లోని అంతర్గత కుమ్ములాటలు, ఆయా పార్టీలు వేసే ఎత్తుగడలు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో పార్టీల పరిస్థితి.. ఎన్నికల్లో పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలను బయటపెట్టడం ప్రతి ఒక్కటి సంచలనాత్మక కథనంగా మారింది. ఏయే నేతలు ఎవరిని టార్గెట్ చేశారు.. ఎవరి వల్ల ఎవరికి ముప్పుంది.. వంటి విషయాలను ఎప్పటికప్పుడు పక్కా ఆధారాలతో ప్రచురించింది. ఇప్పుడు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయా పార్టీల పరిస్థితి ఏంటి.. పట్టభద్రులు ఎవరివైపు ఉన్నారు..? వచ్చే ఎన్నికల్లో ఎవరి భవితవ్యం ఏంటో విశ్లేషణాత్మకంగా వివరించడంతో రాజకీయవర్గాల్లో ‘దిశ’ ఇప్పడో సంచలనంగా మారింది.

మిగతా పత్రికలకు పూర్తి భిన్నం దిశ..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా దిశ పత్రిక ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. కొన్ని పత్రికలు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ భజన వార్తలు ప్రసారాలు చేస్తే, దిశా మాత్రం అందుకు పూర్తి భిన్నంగా.. నిజాన్ని నిర్భయంగా రాస్తూ పత్రికా రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇటు సామాన్యులు, అధికారులు, ప్రజాప్రతినిధుకు వారధిగా నిలుస్తూ, కేవలం సంవత్సర కాలంలోనే ప్రజలకు అత్యంత చేరువగా వెళ్లడం దిశకే సాధ్యమైంది.

-మందపల్లి ఉమ, దిశ కమిటీ ప్రెసిడెంట్, కొత్తగూడెం

అన‌తికాలంలో ఆద‌రాభిమానాలు పొందింది..

దిశ తెలుగు ప‌త్రిక అన‌తికాలంలో మంచి ఆద‌రాభిమానాల‌ను పొందింది. తెలంగాణలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు ఎప్పటిక‌ప్పుడు ప్రజ‌లకు అందించ‌డంలో త‌న‌దైన శైలిలో దూసుకుపోతోంది. పత్రికతోపాటు ‘దిశ’ టీవీ ఛాన‌ల్ కూడా అప్‌డేటెడ్ వార్తలు అందించ‌డంలో స‌క్సెస్ అయింది. రాబోయే రోజుల్లో ఇదే త‌ర‌హాలో మంచి వార్తల‌ను అందించి పాఠ‌కుల ఆద‌రాభిమానాలు పొందాల‌ని కోరుకుంటున్నాను.

మ‌హ్మద్ అఫ్సర్‌, (ద‌మ్మమ్‌, సౌదీ అరేబియా)

Next Story