కొత్త ఏడాదికి శుభారంభం.. ‘దిశ’ క్యాలెండర్ ఆవిష్కరణ

338

దిశ, తెలంగాణ బ్యూరో : ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా ‘దిశ’ దినపత్రిక ప్రచురించిన క్యాలెండర్‌ను ఎడిటర్ డి.మార్కండేయ శనివారం ఆవిష్కరించారు. ‘దిశ’ పత్రిక ఆవిర్భవించిన రెండేళ్ళలో ఇది రెండో క్యాలెండర్. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లోని పత్రిక ప్రధాన కార్యాలయంలో జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అన్ని విభాగాల సిబ్బంది హాజరయ్యారు. సమిష్టి కృషితో, ప్రకటనకర్తల సహకారంతో అన్ని జిల్లాల్లోనూ క్యాలెండర్‌లు అక్కడి చారిత్రక ప్రాచుర్యత కలిగిన కలర్ ఫోటోలతో రూపొందాయి.

ఈ సందర్భంగా ఎడిటర్ మార్కండేయ మాట్లాడుతూ, డిజిటల్ పత్రికా రంగంలో తనదైన ముద్రను సొంతం చేసుకున్న ‘దిశ’ నేడు అనేక మాధ్యమాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ‘దిశ’ ఉనికిలోకి వచ్చి రెండేళ్ళు పూర్తికాకముందే రాష్ట్రవ్యాప్తంగా పాఠకుల ఆదరణను చూరగొన్నదని, అందుకు నిదర్శనమే పది ఉమ్మడి జిల్లాలకు కలిపి పదిహేనుకు పైగా క్యాలెండర్లను ముద్రించడం అని అన్నారు. ప్రధాన పత్రికలకు ధీటుగా దమ్మున్న వార్తలు అందిస్తూ, వినూత్న ప్రయోగాలతో దూసుకెళ్తున్న ‘దిశ’.. ర్యాంకింగ్‌లోనూ ముందున్నదని, సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు.

జంటనగరాలకు చెందిన ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎడిటర్ మార్కండేయతో పాటు బ్యూరో చీఫ్ విశ్వనాథ్, నెట్‌వర్క్ ఇన్‌చార్జి ప్రవీణ్, ఎడిట్ పేజీ ఇన్‌చార్జి ఫజుల్ రహమాన్, సెంట్రల్ డెస్క్(ఏపీ) ఇన్‌చార్జి హరీశ్, చీఫ్ డిజైనర్ బాలు, అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ సురేశ్ శర్మ, ఐటీ ఇన్‌చార్జి అనుకరణ్, యాడ్ ఇన్‌చార్జి అశోక్, డైనమిక్ ఎడిషన్ ఇన్‌చార్జి శ్రీకాంత్, నేషనల్ డెస్క్ ఇన్‌చార్జి స్వామి, వెబ్ టీవీ ఇన్‌చార్జి రాజేష్, వెబ్‌సైట్ డిప్యూటీ ఇన్‌చార్జి నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.