డిగ్గీని లాక్కెళ్లిన బెంగళూరు పోలీసులు

by  |
డిగ్గీని లాక్కెళ్లిన బెంగళూరు పోలీసులు
X

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం ఉదయం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసేందుకు వారు బస చేస్తున్న రమదా హోటల్‌కు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షులు బెంగళూరులో వెళ్లారు. కానీ, బెంగళూరు పోలీసులు డిగ్గీ సహా ఇతర కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. దీంతో హోటల్ ఎదురుగా ధర్నాకు దిగారు. అనంతరం పరిస్థితులు చేజారిపోయేలా ఉన్నాయని భావించిన పోలీసులు దిగ్విజయ్ సింగ్‌ను అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను కలవనీయకుండా ముందస్తుగానే డిగ్గీని అదుపులోకి తీసుకున్నారు.

Tags: digvijay singh, bengaluru cops, detained, ramada hotel, dramatic, rebel congress mla’sNext Story

Most Viewed