టోక్యో బెర్త్ దక్కించుకున్న ద్యుతీ చంద్

by  |
టోక్యో బెర్త్ దక్కించుకున్న ద్యుతీ చంద్
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా స్ప్రింటర్ ద్యుతి చంద్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. గత వారం పాటియాలాలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రీ 4వ రౌండ్‌లో ఒలింపిక్ అర్హత సమయానికన్నా 0.02 సెకెన్లు తక్కువగా పరిగెత్తడంతో ఆమెకు బెర్త్ దక్కలేదు. అయితే తాజాగా ప్రపంచ ర్యాంకింగ్ కోటా ద్వారా ద్యుతి చంద్ 100 మీటర్లు. 200 మీటర్ల విభాగంలో అర్హత సాధించినట్లు భారత అథ్లెటిక్స్ సమాఖ్య తెలిపింది. 100 మీటర్ల విభాగంలో 44వ ర్యాంకులో, 200 మీటర్ల ర్యాంకులో 51 ర్యాంకులో ఉన్న ద్యుతి చంద్ ఆయా విభాగాల్లో అర్హత సాధించింది. మరోవైపు ద్యుతి చంద్‌ను రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఒడిషా ప్రభుత్వం నామినేట్ చేసింది. 2018 ఆసియా క్రీడల్లో రెండు రజత పతకాలు గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించింది.

Next Story

Most Viewed