పోలీస్ సర్వీస్ బయోడేటా ఆన్‌లైన్ చేయాలి

by  |
పోలీస్ సర్వీస్ బయోడేటా ఆన్‌లైన్ చేయాలి
X

దిశ ప్రతినిధి, మెదక్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల, సిబ్బందికి సంబంధించిన సర్వీస్ బయోడేటాను నెల రోజుల్లో ఆన్ లైన్‌ చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తెలంగాణ పోలీస్ అధికారులు, సిబ్బంది సర్వీస్ పర్టికులర్ ఆన్లైన్ ప్రక్రియ గురించి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం ఎంట్రీ గురించి డీజీపీ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఏఓ సవిత, జిల్లాలో ఉన్న పోలీస్ అధికారుల సిబ్బందికి సంబంధించి, ఎంట్రీ చేసిన డాటా వివరాలు వెల్లడించారు. ప్రతి ఎంప్లాయ్ బయోడేటా పూర్తి సమాచారాన్ని నెల రోజులలో పూర్తి చేస్తామని తెలిపారు.

అనంతరం డీజీపీ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది సర్వీస్‌కు సంబంధించిన డాటాను వారం రోజుల్లో ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఎంప్లాయ్ రిజిస్ట్రేషన్ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు, క్యాజువల్ లీవ్, ఏఆర్న్డ్ లీవ్, సరెండర్ లీవ్, మెటర్నటీ లీవ్, మొదలగు వాటి గురించి వివరించారు. సర్వీస్ పర్టికులర్ హెచ్ఆర్ఎంఎస్ సిస్టంలో అప్లోడ్ చేయాలని సూచించారు. డాటా ఎంట్రీ చేసిన తర్వాత పూర్తి పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్‌గా ఉంటుందని రాబోవు భవిష్యత్ కాలంలో ఉద్యోగుల ప్రమోషన్, పెన్షన్ ఇంక్రిమెంట్ తదితర విషయాలు ఎస్పీ స్థాయి నుంచి డీజీపీ స్థాయి అధికారుల వరకు ప్రతిరోజు పర్యవేక్షణ చేయవచ్చని తెలిపారు.


Next Story

Most Viewed