నవరాత్రులలో కన్యా పూజ చేస్తున్నారా.. ఈ విషయాలను అస్సలు మర్చిపోకండి..

by Sumithra |
నవరాత్రులలో కన్యా పూజ చేస్తున్నారా.. ఈ విషయాలను అస్సలు మర్చిపోకండి..
X

దిశ, వెబ్ డెస్క్ : నవరాత్రులలో కన్యాపూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని కుమారి పూజ మరియు కంజాక్ పూజ అని కూడా అంటారు. దుర్గాష్టమి, మహానవమి రోజుల్లో ఆడబిడ్డలను పూజించే సంప్రదాయం ఉంది. నవరాత్రులలో ఆడపిల్లలను పూజించడం ద్వారా తల్లి దుర్గ చాలా సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు. నవరాత్రి వ్రతం మొత్తం ఆచరించే వారు ప్రతిరోజూ కన్యాపూజ చేయవచ్చు. కలశ స్థాపన అనంతరం ఇళ్లలో దుర్గామాతను పూజిస్తారు. ఆడపిల్లలను తల్లి దుర్గా స్వరూపంగా భావిస్తారు, అందుకే నవరాత్రులలో ఆడపిల్లలను పూజిస్తారు. కన్యకా పూజ చేసిన భక్తులకు సంతోషం, శ్రేయస్సు కలగాలని అమ్మవారు దీవెనలను అందిస్తుందట. అయితే ఏ వయస్సు వరకు ఆడపిల్లలను కన్యకా పూజలో కూర్చోబెట్టాలి, తద్వారా వారు ఎలాంటి శుభ ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

దేశ వ్యాప్తంగా అక్టోబరు 3 నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 12 వరకు నవరాత్రులు కొనసాగుతాయి. వాస్తవానికి నవరాత్రులలో తొమ్మిది రోజులు కన్యక బాలికలను పూజించే సంప్రదాయం ఉంది. అయితే ఎక్కువగా నవరాత్రులలో అష్టమి, నవమి తిథి నాడు హవన, ఉపవాసం, కన్యాపూజను ఎక్కువగా చేస్తారు. దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కానీ కన్యక అమ్మాయిని పూజించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేకుంటే దుర్గామాత ఆగ్రహించవచ్చంటున్నారు పండితులు.

పెళ్లికాని అమ్మాయిని పూజించేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..

నవరాత్రులలో ప్రతిరోజూ పెళ్లికాని అమ్మాయిని పూజించాలి. అయితే నవరాత్రుల అష్టమి, నవమి రోజుల్లో తొమ్మిది మంది కన్యలను తప్పనిసరిగా పూజించాలి. దీనితో పాటు వయస్సును గుర్తుంచుకోవాలి. అమ్మాయిల వయస్సు 1 సంవత్సరం నుండి 9 సంవత్సరాల మధ్య ఉండాలి. 1 నుండి 9 సంవత్సరాల మధ్య వయస్సు గల కన్యకా బాలికను దుర్గా దేవి రూపంలో తయారు చేసి ఆహారం పెట్టి, పూజ చేయాలి. ఇలా చేయడం ద్వారా దుర్గామాత చాలా సంతోషిస్తుందట.

కన్యా పూజ ప్రయోజనాలు..

నవరాత్రులలో కన్యా పూజ చేయడం ద్వారా, దుర్గా దేవి ప్రసన్నురాలై అనుగ్రహాన్ని అందిస్తుందట. కన్యను పూజించిన వారికి ధనము, జ్ఞానము, విద్య, అష్టలక్ష్మి, ఐశ్వర్యము, కీర్తి, సుఖము కలుగుతుందట. ఈ రోజు 1 నుంచి 9 మంది ఆడపిల్లలకు పూజలు చేసే సంప్రదాయం ఉంది. మీరు పూజించే అమ్మాయిల సంఖ్య మీరు వారిని ఎన్నిసార్లు ఆరాధిస్తారనే దాని పై ఆధారపడి ఉంటుంది.

Advertisement

Next Story