మీ ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారా..? ఈ సంకేతాలతో ఇలా తెలుసుకోండి..!

by Disha Web Desk 20 |
మీ ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారా..? ఈ సంకేతాలతో ఇలా తెలుసుకోండి..!
X

దిశ, వెబ్‌డెస్క్ : కొంత మంది ఇండ్లను చూస్తే కాస్త భయంకరంగా ఉంటుంది. కానీ కొంత మంది ఇండ్లను చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ప్రశాంత వాతావరణం ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. దేవతలు ఇంట్లో సంచరిస్తున్నారు అని ఎలా తెలుసుకోవచ్చు, ఎలాంటి సంకేతాలు ఇంట్లో కనిపిస్తాయో చాలా మందికి తెలియదు. మరి ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దేవతలు ఇంట్లో తిరిగితే ఆ ఇంటి వారిపై దైవానుగ్రహం ఉంటుందట. ఇంట్లో దీపారాధన చేసిన సమయంలో దీపం ప్రకాశవంతంగా వెలిగితే ఆ ఇంట్లో దేవతాను గ్రహం ఉంటుంది. ఎలాంటి గాలిలేకపోయిన దీపం రెపరెపలాడుతూ కొండెక్కితే దైవానుగ్రహం లేనట్లని శాస్త్రం చెబుతుంది. వంట గదిలో, పూజ గదిలో బల్లులు ఎక్కువగా కనిపిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. అంటే ఆ ఇంట్లో ఉండే వారి ఆర్థిక సమస్యలు అతిత్వరలో దూరమవుతాయని సంకేతం. పాలను వేడిచేసే సమయంలో పాలు పొంగినా ఆ ఇంట్లో లక్ష్మీదేవి ధనరూపంలో వస్తుందని సంకేతం. ఉదయం లేవగానే ఇంటి పరిసరాల్లో ఉడుత కనిసిస్తే ఆ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని చెబుతారు. ఉదయం పూట ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరిస్తే ఆ ఇంటిపై దైవానుగ్రహం ఉందని, ఆ ఇంట్లో దేవతలు సంచరిస్తుంటారని తెలుసుకోవచ్చు. ఈ చిన్న చిన్న సంకేతాలే ఇంట్లో దేవతలు ఉన్నారా లేదా అన్న విషయాన్ని స్పష్టం చేస్తాయని శాస్త్రం చెబుతుంది.Next Story

Most Viewed