శ్రీరామనవమి పండుగ వెనుక ఉన్న ఆసక్తికర శాస్త్రీయ కారణాలు ఇవే..

by Disha Web Desk 10 |
శ్రీరామనవమి పండుగ వెనుక ఉన్న ఆసక్తికర శాస్త్రీయ కారణాలు ఇవే..
X

దిశ, ఫీచర్స్: దేవుళ్లలో శ్రీరాముడి స్థానం వేరు. ఎందుకంటే నిత్యం సత్యమే పలుకుతాడు. హిందూ మతానికి చెందిన వారే కాకుండా అన్ని మతాల వారికి శ్రీరామచంద్రుడి గురించి తెలుసు. భక్తులు అమితమైన భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది చైత్రమాసం నవమి తిథి రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకోనున్నారు. ఏప్రిల్ 16 మంగళవారం మధ్యాహ్నం 1.23 గంటల నుంచి తిథి ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 17వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3.14 గంటలకు తిథి ముగుస్తుంది. ఈ శ్రీరామనవమి పండుగ వెనుక ఆసక్తికర శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ ఇక్కడ తెలుసుకుందాం..

రామ నామం అనేది పవిత్రమైన నామం. దీనిని ఉచ్ఛరిస్తే చాలు. రామ నామాన్ని ఒక్క సారి ఉచ్చరించడం వల్ల ఇతర దేవుళ్ల పేర్లను వెయ్యి సార్లు ఉచ్చరించిన ఫలితం దక్కుతుందని శివుడు చెప్పాడు. రామనామ బలంతో బోయ వాడు వాల్మీకిగా మారి రామాయణం అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు.

ఎండాకాలం మొదలయ్యే ముందు శ్రీరామనవమి పండుగ జరుగుతుంది. నీటి కొరత, అధిక వేడి వంటి సమస్యలు ఈ సమయంలో మనుషుల్ని బాగా ఇబ్బంది పెడతాయి. అలాంటి సమయంలో, రామనామాన్ని జపిస్తూ వేడుకలో పాల్గొనడం వల్ల ప్రజలు ప్రశాంతతను పొందుతారు. ఈ రోజున అనేక మంది భక్తులు ఉపవాసం ఉంటారు. రానున్న రోజుల్లో కరువును తట్టుకునేందుకు ఈ ఆచారం ఉపయోగపడనుంది. ఈ పండుగ రోజున చేసే ఉపవాసం రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. దాని వలన ఎలాంటి వ్యాధులు రావని శాస్త్రీయ నిపుణులు చెబుతున్నారు.

Next Story

Most Viewed