నేటికీ ఆ ఆలయంలో రాధా కృష్ణుల సంభోగం.. రాత్రైతే ఆ శబ్ధాలు

by Disha Web Desk |
నేటికీ ఆ ఆలయంలో రాధా కృష్ణుల సంభోగం.. రాత్రైతే ఆ శబ్ధాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : చిలిపి బాలునిగా, పశువులకాపరిగా, రాధా గోపికా మనోహరునిగా, గోపికల మనసు దోచుకున్నవాడు మువ్వగోపాలుడు. చిన్ని కృష్ణుని తలుచుకుంటే చాలు అల్లరి చేష్టలు, తుంటరి పనులు, బుడి బుడి అడుగులు వేస్తూ వెన్నను దొంగిలిస్తూ, పట్టుబడినప్పుడు తన అమాయకమైన చూపులు గుర్తుకు వస్తుంటాయి. ఆ వేణుగాణం మదిని దోచుకుంటుంది. అలాంటి శ్రీకృష్ణుడి కథలు ఎన్నో శతాబ్ధాల కాలం నుంచి ప్రచారంలో ఉన్నాయి. ఈ కథలన్నీంటికి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, మధుర జిల్లాలోని బృందావన్ నగరం సమీపంలో ఉండే నిధివన్ చిరునామాగా ఉంది. ఈ నిధివన్ ఆలయం బృందావనంలోని దట్టమైన అడవుల మధ్య ఉంది. నిధివన్ ఆలయంలోని శ్రీకృష్ణున్ని అక్కడి ప్రజలు 'ఠాకూర్ జీ' అని పిలుస్తారు. ఈ ఆలయంలో సాయంత్రం 5 గంటల తరువాత ఆ మురళీ మనోహరుడు రాధా గోపికలతో నేటికీ సంభోగం కొనసాగిస్తారని చెబుతుంటారు. అంతే కాదు రాత్రి సమయంలో గజ్జల చప్పుల్లు, మనో హరమైన వేణు గానం కూడా చుట్టుపక్కల గ్రామాల వారికి వినిపిస్తూ ఉంటాయంట. అందుకే అక్కడి ఆలయ పూజారులు, ప్రజలు సాయంత్రం 5 దాటిందంటే చాలు.. ఆ ఆలయాన్ని మూసేస్తారు. అసలు అది నిజమేనా, అబద్దమా అని చాలామంది తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరి ఆ ప్రయత్నం ఏం అయిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మధురా నగరం కేవలం చారిత్రక నగరమే కాదు.. శ్రీకృష్ణుడి జన్మస్థలం కూడా. ఈ నగరం చుట్టూఎన్నో రహస్యాలు దాగిఉన్నాయి. గొప్ప సంగీత కళాకారుడు స్వామి హరిదాస్ ఈ ప్రాంతంలోనే శ్రీ కృష్ణుడి భక్తుడు తాన్సేన్‌కు సంగీతం నేర్పించినట్టు ఓ రాతి ఫలకంపై చెక్కి ఉంటుంది. ఆ ఫలకంపైనే శ్రీకృష్ణుడి రాసలీలల గురించి కూడా స్పష్టంగా ప్రస్తావించారు. అంతే కాదు పురాణాల్లో కూడా ఆ కన్నయ్య చిలిపి చేష్టల గురించి వివరించారు. నిధివన్ ఆలయంలో రాత్రి సమయాల్లో శ్రీకృష్ణుడి రాధ, గోపికలతో కలిసి ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహిస్తాడని అక్కడి ప్రజలు, ఆలయ పూజారులు చెబుతుంటారు. కానీ ఇప్పటి వరకు మానవులెవరూ కూడా దాన్ని చూడలేదు. చూసే సాహసమూ చేయలేదు. ఎవరైనా అంతటి సాహసం చేస్తే వారికి దృష్టి లోపం, వినికిడి సమస్యలు, మూగతనం వస్తాయని చెబుతారు.

సుమారు దశాబ్ధ కాలం క్రితం ఓ శ్రీకృష్ణ భక్తుడు గోపాలుని రాసలీలను చూసేందుకు ఆలయంలోనే ఉండిపోయాడట. తెల్లవారి ఆలయ తలుపులు తెరిచి చూసే సరికి అతని మానసిక స్థితి తప్పి ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. ఈ ఆలయం సమీపంలోని చెట్లు కూడా చాలా వింతగా ఉంటాయి. చెట్ల వేర్లు భూమి నుంచి పైకి వచ్చి, చెట్టు ఉండే కొమ్మలు భూమి వైపు వంగి ఉంటాయి. నిధివన్ లో ఉండే చెట్లు మాత్రమే కాదు. అక్కడ ఉండే తులసి మొక్కలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయట. ప్రతి తులసి మొక్క ఒక జతగా ఉంటుందట. ఆ తులసి మొక్కలను కూడా గోపికలుగా భావిస్తారు అక్కడి ప్రజలు. అందుకే ఆలయ పరిసరాల నుంచి తులసి ఆకులను తుంచడం నిషేదించారు. ఎవరైనా పొరపాటున ఆకులున తుంచితే వారికి ఊహించని విపత్తులు సంభవిస్తాయని నమ్ముతారు.

నిధివన్ లో ప్రశాంత ముఖారవిందంతో కనిపించే శ్రీకృష్ణుడు, రాధా దేవిల ఆలయం మాత్రమే కాకుండా మరో ఆలయం కూడా ఉంది. అదే వన్సీ చోర్ రాధా రాణి ఆలయం ఉంటుంది. ఈ ఆలయ చరిత్ర విషయానికొస్తే శ్రీకృష్ణుడు తన వేణువును వాయిస్తూ రాధా రాణిని పట్టించుకునే వాడు కాదట. దాంతో రాధారాణికి కోసం వచ్చి కృష్ణుడి వేణువును దొంగిలించి దాచిపెట్టిందని చెబుతారు.శ్రీకృష్ణుడు గోపికలు రాసలీల చేసే సమయంలో విశాఖకు తీరని దాహం వేసిందట. దాంతో ఆ చిన్ని కిట్టయ్య తన వేణువుతో ఓ రంధ్రాన్ని తవ్వాడట. అది కాస్తా నీటితో నిండి విశాఖ దాహం తీర్చిందని, అప్పటి నుంచి ఆ కొలనును విశాఖ కుండ్ గా పిలుస్తారని చరిత్ర చెబుతుంది.

నిధివన్ లో మరో ప్రత్యకమైన మహల్‌ను కూడా మనం చూడొచ్చు. అదే రంగ్ మహల్. ఈ ప్రదేశాన్ని కూడా రాధా, కన్నయ్యలు ప్రతి రోజూ రాత్రి సందర్శిస్తారని చెబుతారు. ఆ మహల్‌లో గంధపు చెక్కతో చేయబడిన పాన్పును సువాసనలు వెదజల్లే పూలతో అలంకరిస్తారు. తామర నీటితో పాటు, స్వీట్లు, పాలు, రాధా దేవికి బట్టలు, నగలు ఇలా అన్ని పాన్పుకు దగ్గర్లో ఉంచుతారు. ఉదయం మహల్ తెరచి చూస్తే పరుపు దుప్పటి చెదిరిపోయి, పాలు, స్వీట్లు ఎవరో తిన్నట్టుగా, రాధాదేవి నగలు, బట్టలు చిందర వందరగా ఉంటాయని చెబుతారు. అయితే ఇక్కడ నిజంగానే శ్రీకృష్ణుడు, రాధ ప్రతి రాత్రి సంభోగం చేస్తారా? అనేది అంతుచిక్కని రహస్యం.



Next Story

Most Viewed