శుక్రవారం లక్ష్మీ దేవిని ఇలా పూజిస్తే.. మీ ఇంటి నిండా సంపదే!

by samatah |
శుక్రవారం లక్ష్మీ దేవిని ఇలా పూజిస్తే.. మీ ఇంటి నిండా సంపదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో డబ్బుకు డోకా ఉండదు అంటారు పెద్దవారు. అందే కాకుండా వ్యాపాంలో కానీ, ఏదైనా పని చేసే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పూజలు చేస్తారు. ఇక కీర్తీకి, సంపద, శ్రేయస్సుకు చిహ్నం అయిన లక్ష్మీ దేవి భక్తులందరూ శుక్రవారం రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. అయితే లక్ష్మీ దేవిని శుక్రవారం ఇలా పూజించడం వలన ఆర్థిక సమస్యలు తొలిగి పోయి, ఇంట్లో సంపద నిలుస్తుందంట. అది ఎలాగో ఇప్పుడు చూడండి.

అయితే శుక్రవారం రోజున అమ్మవారిని ఉదయం పూట కాకుండా సాయంత్రం వేళలో పూజించడం చాలా మంచిదంట. సాయంత్రం ఆరుగంటల సమయంలో లక్ష్మీ దేవిని పూజించాలంట. అంతే కాకుండా రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు ఉటాయంటున్నారు పండితులు.

ఉదయం లేచిన వెంటనే ఇల్లు, మూలలు శుభ్రం చేసి ఉతికిన బట్టలు ధరించి ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫొటోను పెట్టి పూజించాలంట. అలాగే శుక్రవారం రోజున ఇళ్లును అందంగా అలంకరించుకోవాలంట. లక్ష్మీ దేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం. అందువలన ఇంటి ముందు, గడప మీద ముగ్గులు వేయాలంట. అలాగే దక్షణ దిశలో అస్సలే లక్ష్మీ దేవి ఫొటోను పెట్టి పూజించకూడదంట. అలాగే ఇంట్లో ఒక్కటే లక్ష్మీదేవి ఫొటో ఉండాలంట. ఒకటి కంటే ఎక్కువ ఫొటోలు ఉండటం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Also Read: దిలో నాణేలు ఎందుకు విసురుతుంటారు.. ఎందుకో తెలుసా?

Next Story

Most Viewed