గంగాదేవి ఇండియాలోనే కాదు ఆ దేశంలో కూడా పూజలందుకుంటుంది..

by Disha Web Desk 20 |
గంగాదేవి ఇండియాలోనే కాదు ఆ దేశంలో కూడా పూజలందుకుంటుంది..
X

దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో గంగానదికి ప్రత్యేక స్థానం ఉంది. హిమాలయాల్లో పుట్టన ఈ గంగానది వారణాసి, ప్రయాగ, హరిద్వార్ నుంచి ప్రయాణం చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగా నది సుమారుగా 2525 కిలోమీటర్లు పొడవున ప్రవహిస్తుంది.

మారిషస్‌లో కూడా గంగానది..

గంగానది లేదా గ్రాండ్ బేసిన్, గంగా తలాబ్ అని కూడా పిలుస్తారు. ఈ గంగానది హిందూ మహాసముద్రం నుంచి 1800 అడుగుల ఎత్తులో ఉండే లేకు తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ పవిత్ర సరస్సు. పెట్రిన్ ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. మారిషస్ లోని సవన్నె జిల్లాలోని ఒక కొండ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతాన్ని మారిషస్‌లో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు.

పౌరాణిక కథ..

పురాణాల ప్రకారం భూలోకవాసులను రక్షించేందుకు పరమశివుడు గంగామాతను తన జటాజూటంలో బంధించాడు. ఆ తర్వాత పరమ శివుడు ఒక అందమైన ప్రదేశాన్ని చూసి అక్కడ దిగాడట. ఆ సమయంలో అనుకోకుండా అనుకోకుండా శివుని జటాజూటం నుంచి గంగాజలం చుక్కలు ఓ చిన్న గొయ్యిలో పడి సరస్సు ఏర్పడిందని చెబుతారు. ఈ పవిత్ర సరస్సును ప్రస్తుతం గంగా తలాబ్ అని పిలుస్తారు.

మారిషస్‌లోని హిందూ పుణ్యక్షేత్రం..

మారిషస్ ద్వీపంలో ప్రతి సంవత్సరం శివరాత్రిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వేలాది మంది భక్తులు ఆ సమయంలో భక్తిశ్రద్దలతో గంగా చెరువు ఉన్న అగ్నిపర్వతం బిలం వద్దకు అతికష్టం మీద ప్రయాణిస్తారు. పోర్ట్ లూయిస్ నుండి లే సెయింట్ గెరాన్ వరకు ప్రయాణిస్తున్నప్పుడు ఆ రహదారిలో తమిళ, హిందూ దేవాలయాలు దర్శనం ఇస్తాయి. చాలా మంది యాత్రికులు తమ ఇళ్ల నుండి ఆలయానికి చేరుకునే వరకు పాదరక్షలు లేకుండా నడుస్తారు.

Next Story