శివరాత్రి రోజు శివలింగాన్ని ఎందుకు పూజిస్తారో తెలుసా?

by Jakkula Samataha |
శివరాత్రి రోజు శివలింగాన్ని ఎందుకు పూజిస్తారో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మహాశివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.శివ భక్తులందరూ,ఎంతో ఇష్టంగా ఉపవాసం ఉంటూ శివయ్యను పూజిస్తారు.ఇక మార్చి8న శివరాత్రి జరుపుకోనున్నారు. ఆరోజు ప్రతి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది.శివనామస్మరణతో ఎంతో నిష్టగా భక్తులు శివయ్యను కొలుచుకుంటారు. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? శివరాత్రి రోజున శివలింగాన్ని పూజిస్తుంటారు.మరి మీకు ఎప్పుడున్న డౌట్ వచ్చిందా అసలు శివరాత్రి రోజున శివలివంగాన్ని ఎందుకు పూజిస్తారు. శివయ్యకు శివలింగానికి మధ్య సంబంధం ఏమిటి ? కాగా దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా శివాలయాల్లో శివలింగమే దర్శనం ఇస్తుంటుంది. అయితే శివలింగానికి శివునికి మధ్య సంబంధం ఏమిటంటే?శివలింగం నిరాకార, అనంతమైన శివ స్వరూపంగా చెపుతారు. ఇది ప్రారంభం , ముగింపు లేనిదని నమ్మకం. శివుడు నిర్గుణుడు, నిరాకారుడు మరియు సాకార మూర్తి. సంస్కృతంలో లింగ అనే పదాన్ని సంకేతం లేదా గుర్తు కోసం ఉపయోగిస్తారు. కాబట్టి శివలింగం అంటే శివుని చిహ్నం. విశ్వాసాల ప్రకారం శివలింగం మహాశివరాత్రి రోజున జన్మించింది. అంతే కాకుండా మొదట విష్ణువు శివరాత్రి రోజున శివలింగాన్ని పూజించారంట. అందుకే అప్పటి నుంచి భక్తులందరూ ఎంతో నిష్టగా శివరాత్రి రోజున శివలింగాన్ని పూజిస్తున్నారు.



Next Story

Most Viewed