దీపావళి పండుగ 12, 13 ఏ రోజు జరుపుకోవాలో తెలుసా?

by Disha Web Desk 6 |
దీపావళి పండుగ 12, 13 ఏ రోజు జరుపుకోవాలో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది దాదాపుగా అన్ని పండుగలు రెండు రోజులు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే దీపావళి కూడా రెండు రోజులు ఉందట. దీపావళి ప్రతి సంవత్సరం కార్తీకమాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారని అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి దీపావళి నవంబర్ 12, 13న అమావాస్య వస్తుంది. దీంతో జనాల్లో పండుగ ఏ రోజు జరుపుకోవాలోనని సందిగ్ధత నెలకొంది.

తాజాగా, దీనిపై పండితులు క్లారిటీ ఇచ్చారు. నవంబర్ 12న మధ్యాహ్నం నుంచి అమావాస్య మొదలై.. 13 సోమవారం మధ్యాహ్నం వరకు ముగుస్తుంది. అయితే దీపావళి రాత్రి సమయాల్లో జరుపుకునేది కాబట్టి 12 తేదీన చేసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. కొందరు మాత్రం అమావాస్య సూర్యోదయం మొదలయ్యే 13వ తేదీన సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా 13వ తేదీన పబ్లిక్ హాలిడే ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థులకు మూడు రోజులు సెలవులు వచ్చాయి. 11 రెండో శనివారం, 12న ఆదివారం, 13న దీపావళి కావడంతో వరుసగా మూడు రోజులు పాఠశాలలు, కాలేజీలు బంద్ కానున్నాయి.


Next Story

Most Viewed