ఈ సంవత్సరం మహాశివరాత్రి ఏ రోజు, ఏ తేదీన జరుపుకోవాలో తెలుసా?

by Disha Web Desk 8 |
ఈ సంవత్సరం మహాశివరాత్రి ఏ రోజు, ఏ తేదీన జరుపుకోవాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు. ఇక మన హిందూ దేశంలో శివయ్యను ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. శివ నామస్మరణ చేస్తూ.. ఆ పరమ శివుడిని వేడుకుంటారు. ప్రతి సోమవారం ఎంతో నిష్టగా భక్తులు నీలకంఠేశ్వరున్ని కొలుచుకోవడం కామన్, కానీ మహాశివరాత్రి రోజు శివయ్యకు జరిగే పూజలు చూడటానికి రెండు కళ్లు చాలవు.ప్రతి పల్లెలో, పట్టణంలో దేవాలయాలు భక్తులతో పరవశించి పోతాయి. ఎటు చూసినా.. ఎక్కడ విన్నా ఆ శివనామస్మరణే వినబడుతూంటుంది. ఇక ఈ పండుగను ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. సంవత్సరానికి ఒకసారి ఫాల్గుణ కృష్ణ చతుర్దశి తిథిలో మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మహాశివరాత్రి నాడు సర్వార్థ సిద్ధి తో కూడిన మూడు శుభయోగాలు కలువబోతున్నాయి. ఆరోజు శ్రావణి, ధనిష్ట నక్షత్రాలు ఉంటాయి.

అయితే ఈ సారి మహా శివరాత్రి ఎప్పుడు అనేదానిపై కొందరిలో పలు సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే? ఈ ఏడాది ఫాల్గుణ కృష్ణ చతుర్దశి తిథి మార్చి 8వ తేదీ శుక్రవారం రాత్రి 9.57 గంటలకు ప్రారంభమై మార్చి 9వ తేదీ వరకు కొనసాగుతుంది. దీంతో శివభక్తులందరూ ఏ రోజు శివరాత్రి జరుపుకోవాలో అర్థంకాక,అయోమయంలో పడుతున్నారు. అయితే మార్చి 8వ తేదీన మహాశివరాత్రి జరుపుకోవాలంటున్నారు పండితులు. ఎందుకంటే శివరాత్రి పూజకు, ఆరోజు మధ్యాహ్నం 12.07 నుండి 12.56 వరకు అనుకూల సమయం ఉంది. రాత్రిపూజ చేయకూడదనుకునే వారు బ్రహ్మ ముహూర్తం నుండి ఏ సమయంలోనైనా చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి రోజున ఉదయం 5.01 గంటల నుండి 5.50 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది.

Read More..

మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నవారు ఏం తినాలో తెలుసా.



Next Story

Most Viewed