వినాయకుడి పెళ్లి ఎలా జరిగిందో తెలుసా? ఎంతమంది భార్యలంటే?

by Anjali |
వినాయకుడి పెళ్లి ఎలా జరిగిందో తెలుసా? ఎంతమంది భార్యలంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: వినాయకుడు బ్రహ్మాచారి అని, ఆయనకు వివాహం కాలేదని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అవి అవస్తవాలని.. వినాయకుడికి పెళ్లయ్యిందని ఇప్పవరకు చాలా మందికి తెలియదు. నిజానికి గణపతి బ్రహ్మాచారిగా ఉండాలనుకున్నాడట. కానీ వినాయకుడు ఒక్కరు కాదు ఏకంగా ఇద్దరు మహిళలను వివాహమాడాడు. అయితే కొన్ని పురాణాల ప్రకారం.. వినాయకుడు దైవిక యోగం ద్వారా రిద్ధి, సిద్ధి అనే ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడట. వీరు బ్రహ్మాదేవుడి మానస పుత్రికలు. అయితే బ్రహ్మాచారిగా ఉంటాడన్న విఘ్నేశ్వరుడికి మరీ ఎలా పెళ్లయ్యిందో ఇప్పుడు చూద్దాం..

గణపతుడు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సమయంలో అటు వైపుగా వెళ్తున్న తులసి ఈయన్ను చూసి ఆకర్షితురాలయ్యింది. దీంతో వినాయకుడిని పెళ్లి చేసుకోమని కోరడంతో తిరస్కరించాడు. కోపాద్రికురాలైన ఆమె నీకు ఒకటి కాదు ఏకంగా రెండు పెళ్లిళ్లు జరుగుతాయని శపించింది. తిరిగి గణపతి కూడా అసురుడితో తులసి వివాహం జరుగుతుందని శపించాడు. అందుకని వినాయకుడి పూజలో తులసిని వాడకూడదని పండితులు చెబుతుంటారు.Next Story

Most Viewed