దాయాది దేశంలో అమ్మవారి ఆలయం.. చైత్ర నవరాత్రుల్లో పెరుగుతున్న భక్తుల రద్దీ..

by Disha Web Desk 20 |
దాయాది దేశంలో అమ్మవారి ఆలయం.. చైత్ర నవరాత్రుల్లో పెరుగుతున్న భక్తుల రద్దీ..
X

దిశ, ఫీచర్స్ : భారత దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా హిందూ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ లోనూ ప్రసిద్ద అమ్మవారి ఆలయం నెలకొంది. ఇతర దేవాలయాలతో పోలిస్తే పాకిస్థాన్‌లోని ఈ ఆలయంలో అత్యధిక రద్దీ ఉంటుంది. ప్రపంచంలోని 51 శక్తిపీఠాలలో ఒకటైన హింగ్లాజ్ మాత దేవాలయం ఎల్లప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది అదే ఆ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయంలో భారతదేశంలో జరిపినట్టుగానే నవరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. అదిచూసిన కొంతమంది భక్తులు ఈ దేవాలయం భారతదేశంలో ఉందా లేదా పాకిస్తాన్‌లో ఉందా అనుకుంటారు. నవరాత్రి సమయంలో ఈ ఆలయంలో గర్బా నుండి కన్యా భోజ్ వరకు అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.

హింగ్లాజ్ దేవాలయం ఉన్న ప్రాంతం పాకిస్తాన్‌లోని అతిపెద్ద హిందువుల ఆధిపత్య ప్రాంతాలలో ఒకటి. చైత్ర నవరాత్రుల సమయంలో ఇక్కడ జాతర నిర్వహిస్తారు. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అంతే కాదు ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వచ్చే మహిళలు గర్బా నిర్వహిస్తారు. అలాగే ఆచారాలవ్యవహారాలతో హవన, పూజలు నిర్వహిస్తారు.

అమర్‌నాథ్ వెళ్లడం కన్నా హింగ్లాజ్‌కు వెళ్లడం చాలా కష్టం అని నమ్ముతారు. ఇప్పటికీ అమ్మ దర్శనం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. నవరాత్రి రోజుల్లో ఈ ఆలయం చాలా రద్దీగా ఉంటుంది. నవరాత్రి రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు దర్శనానికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు ఆలయ సిబ్బంది.

హిందూ, ముస్లిం అనే తేడా కనిపించదు..

నవరాత్రి రోజుల్లో ఈ ఆలయంలో హిందూ, ముస్లిం అనే తేడా ఉండదు. చాలా సార్లు పూజారులు, సేవకులు ముస్లిం టోపీలు ధరించి కనిపిస్తారు. అలాగే దేవి ఆరాధన సమయంలో ముస్లిం సోదరులు హిందువులతో నిలబడి ఉంటారు. వీరిలో ఎక్కువ మంది బలూచిస్థాన్ - సింధ్‌కు చెందిన వారు. ప్రతి సంవత్సరం వచ్చే రెండు నవరాత్రులలో ఇక్కడ అత్యధిక రద్దీ ఉంటుంది. అమ్మవారి దర్శనం కోసం ప్రతి రోజూ వేలాది మంది భక్తులు హింగ్లాజ్ ఆలయానికి వస్తుంటారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు అమెరికా, బ్రిటన్‌కు చెందిన వారు కూడా ఈ ఆలయంలో పూజల్లో పాల్గొంటారు. ముస్లింలు హింగ్లాజ్ ఆలయాన్ని 'నాని బీబీ కి హజ్' లేదా పీర్గాగా భావిస్తారు. అందుకే ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్, ఇరాన్ నుంచి ప్రజలు పీర్గాలోని ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తారు.

Next Story

Most Viewed