ముత్యాలతో అదృష్టం.. ఈ రాశివారు ధరిస్తే వారికి తిరుగే ఉండదంట

by Disha Web |
ముత్యాలతో అదృష్టం.. ఈ రాశివారు ధరిస్తే వారికి తిరుగే ఉండదంట
X

దిశ, వెబ్‌డెస్క్ : ముత్యాలు చూడటానికి చాలా బాగుంటాయి. అంతే కాదు అందంగా కనిపించడం కోసం వాటితో ముత్యాల హారాలు చేయించి వేసుకుంటారు మగువలు. అయితే ముత్యాలు అందానికే కాదండోయి.. వీటితో అనేక శుభపరిణామాలు ఉంటాయంటున్నారు జ్యోతిష్యులు. జ్యోతిషశాస్త్రంలో, ముత్యాలు చంద్ర గ్రహానికి సంబంధించినవిగా పరిగణిస్తారు. అలాగే రాశిచక్రాలతో ముత్యాలు, రత్నాలకు సంబంధం ఉంటుందంట. అందుకే చాలా మంది. జాతకం ప్రకారం ముత్యం, రత్నం ధరిస్తూ ఉంటారు. అయితే ముత్యాలు ధరించిన వ్యక్తి జాతకంలో చంద్రుడు ,శుక్రుడు బలం వల్ల జీవితంలో అనేక శుభ ఫలాలను లభిస్తాయి.

ఏ రాశి వారు ముత్యాలు ధరిస్తే శుభ ఫలాలు లభిస్తాయో ఇప్పుడు చూద్దాం.

జ్యోతి‌ష్యశాస్త్రం ప్రకారం ఒక్కొక్కరి జాతకం ఒక్కో విధంగా ఉంటుంది. అయితే కొందరికి మంచి జరగాలని ముత్యాలు ధరిచడం లాంటివి చేస్తుంటారు. ఇక కొందరికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముత్యాలు, లేదా రంగురాళ్లు ధరించడం వలన చాలా మేలు జరుగుతుంది. వీటి వలన వారి ఇంటిలో ఆర్థికపరమైన సమస్యలు తొలిగిపోయి, కుటుంబ కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారంట. అయితే ఏయే రాశులకు మేలు జరుగుతుంది అంటే కర్కాటక రాశి వారికి ముత్యాలు ధరించడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అలాగే మేష, తుల, వృశ్చిక, మీన రాశుల వారు ముత్యాలు ధరించడం శ్రేయస్కరం.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed