తులసి మొక్కకు ఆ సయమంలో నీళ్లు పోస్తున్నారా.. అంతా అశుభమే..

by Dishanational2 |
తులసి మొక్కకు ఆ సయమంలో నీళ్లు పోస్తున్నారా.. అంతా అశుభమే..
X

దిశ, వెబ్‌డెస్క్: తులసి మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన హిందు ధర్మంలో తులసి మొక్కను లక్ష్మీదేవి ప్రతిరూపంగా పిలుస్తారు.vఅంతేకాదు విష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరం. మన భారతీయ మహిళలు ప్రతిరోజు దీపం పెట్టడమే కాకుండా తమ సౌభాగ్యం బలంగా ఉండాలని, ఇంట్లో శాంతి, సుఖాలు కలగాలని తులసి మొక్కకు పూజలు చేస్తుంటారు. ఇలా పూజలకే కాకుండా తులసిలో చాలా ఔషదగుణాలు కూడా ఉంటాయి. తులసి ఆకులు చాలా జబ్బులకు వంటింటి చిట్కాలుగా కూడా ఉపయోగపడతాయని నిపుణులు కూడా తెలిపారు.

ఇంతటి విలువైన తులసి మొక్కకు కొన్ని సమయాల్లో నీళ్లు పోయడం అశుభం అని చెబుతున్నారు. అలా చేస్తే ఇల్లు దుష్ట శక్తుల బారిన పడుతుందని నమ్మకం. అయితే ఎటువంటి సందర్భాలలో నీళ్లు పోయకూడదంటే.. ఆదివారం రోజున, సూర్య, చంద్ర గ్రహణాలు, ఏకాదశి సమయాల్లో తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. అంతే కాదు సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తెంపకూడదు. ఎండిన తులసి మొక్కను ఇంట్లో ఉంచుకోకుడదు. ఆ మొక్కని బావిలో కానీ, చెరువులో లేదా పవిత్రమైన స్థలాల్లో పడేయాలి. తర్వాత కొత్త మొక్క తెచ్చుకుని నాటుకోవాలి.


Next Story