మకర జ్యోతి దర్శనం.. సర్వపాప హరణం..

76

దిశ, వెబ్ డెస్క్: శబరిలో అయ్యప్పను దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులకు ఇవాళ పోన్నాంబల మేడు కొండపై మకర జ్యోతి దర్శనం లభించింది. మకర జ్యోతి కనపడగానే ఆ ప్రాంతం మొత్తం శరణు ఘోషతో మారుమోగింది. కొండ పై మకర జ్యోతి మూడు సార్లు భక్తులకు దర్శనం ఇచ్చింది. ఒక్క సారిగా భక్తులు ఆనందం, భక్తితో ఊగిపోయారు. శబరి గిరీషా అయ్యప్పా, పంపావాసా అయ్యప్పా అంటూ పులకరించి పోయారు.

మొదట స్వామి వారికి బంగారు ఆభరణాలు తీసుకువెళ్లారు. అనంతరం పెద్ద ఊరేగింపు జరిగింది. మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు కొండపైకి చేరుకున్నారు. కోవిడ్ కారణంగా కొన్ని నిబంధనలు ఉన్నా భక్తుల సంఖ్య మాత్రం తగ్గలేదు. దర్శనార్దం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.