పరిహారం ఇవ్వకుండా శంకుస్థాపనలా..?

by  |
పరిహారం ఇవ్వకుండా శంకుస్థాపనలా..?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: భూ నిర్వాసితులకు సరియైన నష్టపరిహారం ఇవ్వకుండా కంపెనీలు ప్రారంభించడం సరికాదని ఆ సంఘం పోరాట సమితి అధ్యక్షుడు చేవెళ్ల స్వామి విమర్శించారు. కంపెనీ ప్రారంభానికి వచ్చిన కేటీఆర్ ను అడ్డుకుంటారని ముందోస్తుగా భూ నిర్వాసితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ… స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, రూ. 18 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుపేద బడుగు వర్గాల చిన్న, సన్న కారు రైతులు తమ గోడును చెప్పుకునే హుక్కను మంత్రి కేటీఆర్ హరింపజేశారన్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ ను చూసుకొని చేవెళ్ల ఏసీపీ, సీఐ విచక్షణ రహితంగా ప్రవర్తించారని ఆయన అన్నారు. అయితే.. నిరసనల మధ్య కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.Next Story

Most Viewed