‘హలోవీన్’ వేళ పళ్లూడగొట్టుకుంటున్నారు..

by  |
‘హలోవీన్’ వేళ పళ్లూడగొట్టుకుంటున్నారు..
X

దిశ, వెబ్‌డెస్క్: హలీవీన్..మన దేశంలో గతంలో ఎప్పుడూ లేనంతగా పాపులర్ అయ్యింది. సెలెబ్రిటీలే కాదు. సామాన్యులు కూడా ఈ పండుగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పండుగ జరుపుకోవడంలో తప్పులేదు కానీ, దానికోసం పళ్లు ఊడగొట్టుకుంటే ఎలా? ఇప్పుడు అదే జరుగుతోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవాలనే ఉద్దేశంతో ఈ తరహా సంప్రదాయానికి నెటిజన్లు, యూట్యూబర్లు, టిక్ టాకర్లు తెరతీశారు. అందులో భాగంగా హలోవీన్ కోసం జాంబీల్లా తయారై పోస్టులు పెడుతున్నారు.

ఈ క్రమంలో జాంబీల్లా తయారవడం అందుకోసం నానా తంటాలు పడటం వల్ల అసలకే మోసం వస్తోంది.
దయ్యాల్లా తయారు కావడంలో భాగంగా రాక్షసుల్లా కోర పళ్లను అంటించుకోవాలి. అందుకోసం నెయిల్ గ్లూ లేదా సూపర్ గ్లూ ఉపయోగిస్తున్నారు. దీని వల్ల దంతాలు పాడవడమే కాకుండా, దంతాలపై ఉన్న ఎనామిల్ కూడా దెబ్బతింటుంది. దంతాలు వాటి సెన్సివిటీని కోల్పోతాయి. అంతేకాదు ఈ గ్లూల వల్ల జింజివల్ ఇన్‌ఫ్లమేషన్ అవుతుంది. దాంతో రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ అవసరమవతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది కోర దంతాల కోసం జిగురు రాసుకుని ఆ దంతాలను పీకలేక, లేదా దాని వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ల కారణంగా డెంటిస్ట్ దగ్గరికి పరిగెత్తుతున్నారు.

సోషల్ మీడియాలో జాంబీ వీడియోలో ఓ వైపు వైరల్ అవుతుండగా మరోవైపు ఇలా చేసినందుకు తమ దంతాలు ఇలా అయిపోయాయి..అంటూ రియాలిటీని చూపిస్తున్న వీడియోలు కూడా అంతే వైరల్ అవుతున్నాయి. మరి జాంబీలా మారుతున్న వాళ్లు కాస్త ఆలోచించాల్సిందే. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం మన ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం నిజంగా విడ్డూరమే.

Next Story

Most Viewed