ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్..!

by  |
ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్..!
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని టీడీపీ క్రమశిక్షణ సంఘం సభ్యులు బక్కని నర్సింహులు, పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ఆరోపించారు. దళితులకు మూడు ఎకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. శనివారం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అర్హులందరికీ మూడెకరాల భూపంపిణీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‎కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ రెండు సార్లు అధికారం చేపట్టినా దళితులకు మాత్రం న్యాయం జరగలేదన్నారు. దళితులకు వెంటనే మూడెకరాల భూమితో పాటు రెండు పడుకల గదులను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story