అమ్మాయి స్కూటీకి ‘SEX’ నంబర్ ప్లేట్.. ఎలా వచ్చిందో తెలుసా?

by  |
scooty
X

దిశ, ఫీచర్స్ : ప్రతీ ఒక్కరు తమ వెహికల్‌కు యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే కొంతమంది ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకునేందుకు చాలా డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే మన వాహనం నంబర్ ప్లేట్ పక్కవారి అటెన్షన్ క్యాచ్ చేసేంత ప్రత్యేకత కలిగి ఉండాలనుకోవడం సహజమే అయినా.. ఒక్కోసారి ఈ పరిణామాలే ఇబ్బంది కలిగించవచ్చు. ఢిల్లీకి చెందిన ఓ యువతి స్కూటీ విషయంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. రిజిస్ట్రేషన్ ద్వారా ఆమె పొందిన నంబర్ ప్లేట్ తనకు చాలా ఇబ్బందిని కలిగించింది. ఆమె రిజిస్ట్రేషన్ ప్లేట్ పొంది మూడు వారాలైనా.. తన వెహికల్ బయటకు తీయలేదు. ఎందుకంటే ఆ నంబర్‌లో S-E-X అనే పదం ఉంది.

ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థి అయిన ఢిల్లీ యువతికి ఆమె తండ్రి స్కూటీ ఇప్పించాడు. ఇంతకుముందు మెట్రోలో ప్రయాణించే తను.. రద్దీ కారణంగా స్కూటీ కొనివ్వమని తండ్రిని అడగడంతో దివాళీ కానుకగా స్కూటీ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆమె సోదరుడు నంబర్ ప్లేట్ వేయించేందుకు తీసుకెళ్లగా.. ఢిల్లీ RTO ఆమె స్కూటీకి DL3 SEX ** అనే నంబర్‌ను కేటాయించింది. కాగా వాహనంపై అమర్చబోతున్న నంబర్ ప్లేట్ చాలా మందికి ఫన్నీగా కనిపిస్తుందని, తన కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుందని అతను ఊహించలేదు. ఇంటికొచ్చాక ఈ విషయాన్ని గ్రహించగా.. ఆ బండిని బయటకు తీసేందుకు సదరు యువతి ఇష్టపడటం లేదు.

ఇక ఆ అమ్మాయి తండ్రి రిజిస్ట్రేషన్ నంబర్‌ మార్పు కోసం అభ్యర్థించినట్లూ తెలుస్తోంది. కానీ ఇప్పటికే అనేక వాహనాలకు ఆ సిరీస్‌కు చెందిన నంబర్ కేటాయించామని, కాబట్టి ఇప్పుడు, మార్చే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.


Next Story

Most Viewed