ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

by  |
ఢిల్లీ క్యాపిటల్స్ ఘన  విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 19వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాజయం చవిచూసింది. ఢిల్లీ బౌలర్లు పంజా విసరడంతో చాలెంజర్స్ బ్యాట్స్‌మెన్లు తోక ముడిచారు. వచ్చిన బ్యాట్స్‌మెన్లను వచ్చినట్టే పెవిలియన్‌కు పంపారు. విరాట్‌ కోహ్లీ(43) మినహా ఏ ఆటగాడు క్రీజులో కుదురుకోలేదు. 20 ఓవర్లలో బెంగళూరు 9 వికెట్ల నష్టానికి కేవలం 137పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 59 పరుగుల భారీ తేడాతో ఢిల్లీ గెలుపొందింది.

ఆర్సీబీ ఇన్నింగ్స్:

197 పరుగుల లక్ష్యంతో బరిలోని దిగిన చాలెంజర్స్ ఆదిలోనే కుప్పకూలారు. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్(4), ఆరోన్ ఫించ్(13) పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేశారు. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ క్రీజులో ఉన్నా.. మిడిలార్డర్ ఏబీ డివిలియర్స్ (9) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో తొలి పవర్ ప్లే ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి ఆర్బీబీ 43 పరుగులు మాత్రమే చేసింది.

ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ కోహ్లీకి స్ట్రైక్ రోటేట్ చేస్తూ.. బ్యాటింగ్ మొదలు పెట్టాడు. అయినా 11 పరుగులు మాత్రమే చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. మొదటి నుంచి బాల్ టు బాల్ ఆడుకుంటూ వచ్చిన కెప్టెన్ కోహ్లీ(43) చేసి పర్వాలేదనిపించాడు. 14వ ఓవర్‌లో రబాడా వేసిన బంతిని కొట్టబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 95 పరుగుల వద్ద ఆర్సీబీ 5 కీలక వికెట్లను కోల్పోయింది.

ఇక 6,7 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన వాషింగ్టన్ సుందర్ (17), శివం దూబే (11) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇసురు ఉదాన(1) నవదీప్ సైని(12), మహ్మద్ సిరాజ్(5) పరుగులతో సరిపెట్టుకున్నారు. దీంతో ఆర్సీబీ నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగలిగింది.

ఢిల్లీ ఇన్నింగ్స్:

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఇన్నింగ్స్‌ ఆడింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌లో విఫలమైనా.. మిగతా ఆటగాళ్లు సమిష్ఠిగా రాణించి 196 పరుగులు చేశారు. మొత్తం నిర్ధిష్ఠ 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది

ఓపెనర్లు పృథ్వీ షా-శిఖర్ ధావన్ క్రీజులో ఉన్నంత సేపు పరుగుల వరద పారించారు. తొలి పవర్ ప్లే ముగిసే సరికి కరెంట్ స్ట్రైక్ రేట్ 10.5తో 63 పరుగులు చేశారు. ముఖ్యంగా పృథ్వీ షా 23 బంతుల్లోనే 5 ఫోర్లు 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. ఆ తర్వాత 7వ ఓవర్‌లో సిరాజ్ వేసిన బంతిని కొట్టబోయి కీపర్ డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికే క్రీజులో ఉన్న శిఖర్ ధావన్-వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యార్‌లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు.

10వ ఓవర్‌లో శిఖర్ ధావన్ ఉదాన వేసిన బంతికి షాట్ ఆడబోయి మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చాడు. మొత్తం 28 బంతుల్లో 3 ఫోర్లు కొట్టిన శిఖర్ 32 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన రిషబ్ పంత్ బ్యాట్‌కు పని చేప్పే సమయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ 11 పరుగులు మాత్రమే చేసి 90 స్కోర్ బోర్డు వద్ద చేతులెత్తేశాడు. మిడిలార్డర్లు పంత్-స్టోయినిస్ జట్టు భారాన్ని మీదేసుకొని మంచి ఇన్నింగ్స్ ఆడారు. రిషబ్ పంత్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 37 పరుగులు చేసి 179 స్కోరు బోర్డు వద్ద పెవిలియన్ చేరాడు.

ఇక స్టోయినిస్ మాత్రం ముందు నుంచే బ్యాటింగ్ పరంపర కొనసాగిస్తూ.. బౌండరీల మోత మోగించాడు. కేవలం 26 బంతులను ఫేస్ చేసి 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. హాఫ్ సెంచరీ (53) పూర్తి చేసుకొని నాటౌట్‌గా నిలిచాడు. పంత్‌ తర్వాత వచ్చిన హెట్మేయర్ 7 బంతుల్లో 11 పరుగులు చేసి నాటౌట్‌గానే నిలబడ్డాడు. దీంతో 4 వికెట్ల నష్టానికి నిర్ధిష్ఠ 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 196 పరుగులు చేయగలిగింది.

స్కోర్ బోర్డు:

Delhi Capitals Innings: పృథ్వీ షా c ఏబీ డివిలియర్స్ b సిరాజ్ 42(23), శిఖర్ ధావన్ c మొయిన్ అలీ b ఇసురు ఉదాన 32(28), శ్రేయాస్ అయ్యార్ (c)c దేవదత్ పడిక్కల్ b మొయిన్ అలీ 11(13), రిషబ్ పంత్ (wk)b సిరాజ్ 37(25, మార్క్యూస్ స్టోయినిస్ నాటౌట్53(26), హెట్మేయర్ నాటౌట్ 11(7), ఎక్స్‌ట్రాలు 10 మొత్తం స్కోరు: 196/4

వికెట్ల పతనం: 68-1 (పృథ్వీ షా , 6.4), 82-2 (శిఖర్ ధావన్, 9.4), 90-3 (శ్రేయాస్ అయ్యార్, 11.3), 179-4 ( రిషబ్ పంత్, 18.2).

బౌలింగ్: ఇసురు ఉదాన 4-0-40-1, వాషింగ్టన్ సుందర్ 4-0-20-0, నవదీస్ సైని 3-0-48-0, యూజువేంద్ర చాహల్ 3-0-29-0, మహ్మద్ సిరాజ్ 4-0-34-2, మొయిన్ అలీ 2-0-21-1.

Royal Challengers Bangalore Innings: దేవదత్ పడిక్కల్ c స్టోయినిస్ b అశ్విన్ 4(6), ఆరోన్ ఫించ్ c పంత్ b అక్సర్ 13(14), విరాట్ కోహ్లీ (c)c పంత్ b రబాడా 43(39), ఏబీ డివిలియర్స్ (wk)c ధావన్ b నార్ట్జే 9 (6), మొయిన్ అలీ c హెట్మేయర్ b అక్సర్ 11(13), వాషింగ్టన్ సుందర్ c అశ్విన్ b రబాడా 17(11), శివం దూబే b రబాడా 11(12), ఇసురు ఉదాన c శ్రేయాస్ అయ్యర్ b రబాడా 1(3), నవదీప్ సైని నాటౌట్12(12), మహ్మద్ సిరాజ్ b నార్ట్జే 5(4), యూజువేంద్ర చాహల్ నాటౌట్.. ఎక్స్‌ట్రాలు11, మొత్తం స్కోరు 137/9

వికెట్ల పతనం: 20-1 (దేవదత్ పడిక్కల్, 2.6), 27-2 (ఆరోన్ ఫించ్, 3.6), 43-3 (ఏబీ డివిలియర్స్, 5.5), 75-4 (మొయిన్ అలీ, 11.6), 94-5 (విరాట్ కోహ్లీ, 13.3) 115-6 (వాషింగ్టన్ సుందర్, 15.6). 118-7 (శివం దూబే, 17.1), 119-8 (ఇసురు ఉదాన, 17.3).127-9 (మహ్మద్ సిరాజ్, 18.6)

బౌలింగ్: కగిసో రబాడా 4-0-24-4, నార్ట్జే 4-0-22-2, రవి చంద్రన్ అశ్విన్ 4-0-26-1, అక్సర్ పటేల్ 4-0-18-2, హర్షల్ పటేల్ 4-0-43-0.

పాయింట్ టేబుల్:

Next Story