సిగరెట్ల చోరీ కేసులో నిందితుడు అరెస్ట్ : జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర

by  |
సిగరెట్ల చోరీ కేసులో నిందితుడు అరెస్ట్ : జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర
X

దిశ, అదిలాబాద్: రూ,8 లక్షల విలువైన సిగరెట్ల కార్టూన్లు, పాన్ మసాలా దొంగలించిన కేసులో ప్రధాన నిందితున్ని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర పేర్కొన్నారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్ 8న ఐదుగురు నిందితులు ఐచర్ వాహనం నెంబర్ MH17-T,7838 లో వచ్చి వన్ టౌన్ పరిధిలోని బి రాములు కాంప్లెక్స్ లోగల ఐఏ ట్రేడర్స్ షట్టర్ తాళాలు పగలగొట్టి రూ, 8 లక్షల విలువైన సిగరెట్లు, పాన్ మసాలా కార్టూన్లు దొంగలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభింఛారు. అక్టోబర్ 31న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, పోయిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో ఆగస్టు 21న పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీల సమయంలో పెండింగ్ లో ఉన్న కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించామన్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు, క్రైమ్ వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టగా, సోమవారం సాయంత్రం విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో సిసిఎస్ పోలీసులతో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టగా, ఐచర్ వాహనంను స్వాధీనం చేసుకొని, సిగరెట్ల చోరీకేసులోని నాలుగవ నిందితుడు మహారాష్ట్ర, అహ్మద్ నగర్ జిల్లాలోని దారేవాడి గ్రామానికి చెందిన దానే కమలేష్, బాలా సాహెబ్ @ కమలేశ్ తివారి (34)ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మరో నిందితుడిని త్వరలో అరెస్టు చేసి కేసు దర్యాప్తు పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ కేసును సీసీటీవీ కెమెరాల ద్వారా వాహనంను గుర్తించి నిందితులను అరెస్టు చేసి పోయిన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చోరీ కేసు దర్యాప్తులో సీసీటీవీ కెమెరాలు కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు. పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్ళు, దుకాణ సముదాయల వద్దా సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సిఐ ఎస్.రామకృష్ణ, ఎస్ఐలు జి అప్పారావులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed