హుస్సేన్ సాగర్‌ నీటిలో తగ్గిన ఆక్సీజన్.. ఇలాగే కొనసాగితే ప్రమాదమే..

88

దిశ, తెలంగాణ బ్యూరో: హుస్సేన్ సాగర్ నీటిలో ఆక్సీజన్ శాతం తగ్గింది. మరింత తగ్గితే జలచరాశుల ఉనికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అధికారులు జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ చెరువులో నీటిలో ఆక్సీజన్ శాతాన్ని పరిశీలించారు. ఎన్టీఆర్ పార్కు, లుంబీనిపార్కు, నెక్లెస్ రోడ్డు, లేపాక్షి హ్యాండ్ క్రాప్టు, బుద్ద విగ్రహం సమీపంలోని సెంట్రల్ పాయింట్ వద్ద నీటిని సేకరించారు. వినాయక నిమజ్జనం ముందు, ఆ రోజు, ఆ తర్వాత మూడు రోజులు నీటిని సేకరించి పరీక్షలు నిర్వహించారు. సాధారణంగా హుస్సేన్ సాగర్ లో గల లీటర్ నీటిలో నిమజ్జనంకు ముందు 4 ఎంజీ ఉండగా, నిమజ్జనం రోజు స్థిరంగా, ఆ తర్వాత రోజు 3.5 నుంచి 3.6 వరకు తగ్గింది. సుమారు .5శాతం ఆక్సీజన్ తగ్గింది.

దీనికి తోడు కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ), బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) లీటర్ నీటిలో 3 ఎంజీ ఉండగా, నిమజ్జనం తర్వాత 4.2 నుంచి 4.8 వరకు పెరిగింది. సుమారు 1.8 ఎక్కువ అయింది. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం కొనసాగితే నీటిలో ఆక్సీజన్ స్థాయి మరింతగా తగ్గి ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..