ఇండోర్‌లో మరణాల కలవరం

by  |
ఇండోర్‌లో మరణాల కలవరం
X

భోపాల్: కరోనా రక్కసి ధాటికి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం విలవిలలాడుతోంది. ఈ వైరస్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 69 మరణాలు సంభవించగా, ఇందులో 47 మరణాలు ఒక్క ఇండోర్‌లోనే నమోదు కావడం కలవరానికి గురిచేస్తోంది. ఇక పాజిటివ్ కేసులూ ఇండోర్‌‌లోనే అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1400 మంది కరోనా బారినపడగా, ఇందులో 900మంది ఇండోర్‌ నుంచే ఉన్నారు. అలాగే, గడిచిన 24 గంటల్లో దేశంలో 28 మరణాలు చోటుచేసుకుంటే అందులో 12 మరణాలు మధ్యప్రదేశ్‌లోనే నమోదయ్యాయి.

Tags: indore, corona, deaths, rise, madhya pradesh

Next Story

Most Viewed