వాటిలో స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు కల్పించాలి: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి..

by  |
వాటిలో స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు కల్పించాలి: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి..
X

దిశ, నేరేడుచర్ల: డీసీఎల్ వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.8 మిలియన్ టన్నుల నుంచి 4.0 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు..పర్యావరణ అనుమతుల కోసం గురువారం కంపెనీ ఆవరణలో సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమల్లో స్థానిక యువతకు 70 శాతం ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఉద్యోగాల కల్పనలో డెక్కన్ కంపెనీ మిగతా కంపెనీలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. డెక్కన్ సిమెంట్‌లో ఏండ్ల తరబడిగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

కంపెనీలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు సర్వీస్ ఎక్సటెన్షన్ చేస్తున్నారని, ఫలితంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆయన చెప్పారు. హుజుర్ నగర్ నియోజకవర్గంలో 35వేల మంది యువత ఉన్నారని, వారందరికీ స్థానిక కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వాలని తెలిపారు. కంపెనీలో పోల్యూషన్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయాలని, పోల్యూషన్ వివరాలను వెబ్ సైట్‌లో పిసిబి పొందుపర్చాలని అధికారులను ఆదేశించారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తే.. జీఎస్టీలో ప్రభుత్వంతో మాట్లాడి రాయితీ కల్పిస్తామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఒక్కటే కాకుండా.. చిన్న చిన్న కాంట్రక్ట్ పనులను సైతం యువతకు ఇచ్చే ఆలోచన చేయాలని వివరించారు.

ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పీసీబీ నల్గొండ జిల్లా ఈ ఈ రాజేందర్, డీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరాజు, సీఎంలు నాగమల్లేశ్వరరావు, ఎండీ మస్తాన్, ఎంపీపీ గోపాల్, సర్పంచ్‌లు ఆరేళ్ల శ్వేత, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ రమావత్ కవిత, వైస్ ఎంపీపీ ఉపేందర్ రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కె.అంజిరెడ్డి, దుర్గరావు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పరిశ్రమలకు మేం వ్యతిరేకం కాదు. పరిశ్రమలు పెరగాలి.. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

Next Story

Most Viewed