క్రికెట్ వెస్టిండీస్ డైరెక్టర్‌గా డారెన్ సామి

by  |
క్రికెట్ వెస్టిండీస్ డైరెక్టర్‌గా డారెన్ సామి
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) బోర్డు స్వతంత్ర డైరెక్టర్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ డారెన్ సామిని నియమించారు. జూన్ 17న జరిగిన బోర్డు మీటింగ్‌లో అతడిని నాన్ – మెంబర్ కోటాలో డైరెక్టర్‌గా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. సామి ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నాడు. అతడితో పాటు ట్రినిడాడ్‌కు చెందిన డెబ్రా, జమైకాకి చెందిన డాక్టర్ అక్షయ్ మాన్‌సింగ్ కూడా స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించబడ్డారు.

‘నన్ను సీడబ్ల్యూఐ డైరెక్టర్‌గా నియమించడం గౌరవంగా భావిస్తున్నాను. క్రికెట్ వెస్టిండీస్‌కు తాను తిరిగి సేవ చేసే అవకాశం కొత్త రూపంలో కలిగింది’ అని సామి పేర్కొన్నాడు. వెస్టిండీస్ తరపున 38 టెస్టులు, 128 వన్డేలు, 68 టీ20 ఆడిన సామి.. రెండు సార్లు ఆ జట్టుకు కెప్టెన్‌గా టీ20 వరల్డ్ కప్ అందించాడు. సామి ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ జట్టుకు కోచ్‌గా పని చేస్తున్నాడు.

Next Story

Most Viewed