నిర్మల్‌లో విచిత్రం.. నెత్తిమీద మూడు తీగలు

by  |
power-lines1
X

దిశ, నిర్మల్ రూరల్: నిర్మల్ జిల్లా మామడ మండలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులెవరూ తమ సమస్యలను పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే… మండలంలోని నల్దుర్తి గ్రామంలో ఓ రైతు పంట భూమిలో విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. వాటితో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందోనని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ తీగలను సరిచేయాలని కోరుతున్నాడు.


Next Story

Most Viewed