విజయ డైరీకి పాలుపోస్తే పట్టించుకోరా.. ప్రభుత్వంపై మండిపడుతున్న పాడి రైతులు

by  |
విజయ డైరీకి పాలుపోస్తే పట్టించుకోరా.. ప్రభుత్వంపై మండిపడుతున్న పాడి రైతులు
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: (విజయ) డైరీ‌కి పాలు పోస్తున్న రైతులను పట్టించుకోకుండా, పాల ధర పెంచకుండా, ప్రైవేటు సంస్థలకు మద్దతు పలుకుతున్న ప్రభుత్వం ఇన్సెంటివ్‌లు చెల్లించి, పాల ధరలు పెంచి పాడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు, జనగామ జిల్లా చిల్పూర్, స్టేషన్ ఘన్ పూర్ మండలాల పాడి రైతులు.

1370 మంది పాడి రైతులు..

స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ మండలాల పరిధిలో 1370 మంది పాడి రైతులు విజయ( ప్రభుత్వ) డైరీకి ప్రతిరోజు రెండు పూటలు పాలు పోస్తున్నారు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా పశు పోషణ చేస్తూ పాల ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకు మేత( పచ్చి గడ్డి), దాన, మందులు మొదలైన వ్యయప్రయాసల‌ను అధిగమించి రెండు మండలాలకు చెందిన 1370 మంది పాడి రైతులు పాల ఉత్పత్తి చేస్తున్నారు.

89 వేల 4 వందల లీటర్లు

చిల్పూర్, స్టేషన్ ఘన్ పూర్ మండలాల పరిధిలోని 2 పాల శీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కలుపుకొని 89 వేల 4 వందల లీటర్ల పాల సేకరణ జరుగుతుంది. ఇలా సేకరించిన పాలను స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ (బీఎంసీయు) పాల శీతలీకరణ కేంద్రం ద్వారా విజయ డైరీ‌కి పంపుతారు.

పాల ధరలో వ్యత్యాసం

పాలు ఉత్పత్తి చేసే పాడి రైతులకు చెల్లించే లీటరు ధర ప్రభుత్వ( విజయ డైరీ), ప్రైవేటు సంస్థల ధరలలో వ్యత్యాసం ఉంది. బర్రె పాలకు విజయ డైరీ ఇన్సెంటివ్ కలుపుకొని రూ.34.63 పైసలు చెల్లిస్తుండగా ప్రైవేటు సంస్థలు ఇన్సెంటివ్‌తో రూ.38 చెల్లిస్తున్నారు. ఆవు పాలకు విజయ డైరీ ఇన్సెంటివ్‌తో కలుపుకొని రూ.32.29 పైసలు ఇస్తుండగా ప్రైవేటు డైరీలు ఇన్సెంటివ్ కలుపుకొని రూ.34.48 పైసలు ఇస్తున్నారు. బర్రె పాలు లీటరుకు రూ. 3.37 పైసలు, ఆవు పాలకు రూ.2.19 పైసల వ్యత్యాసం ఉంటుంది.

నమ్ముకుంటే వమ్ము చేస్తున్నారు

ప్రభుత్వం (విజయ)డైరీని నమ్ముకొని పాలు పోస్తుంటే అధికారులు వమ్ము చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. డబ్బు సంపాదన కోసం ప్రైవేటు డైరీలు పెట్టుకుంటే ప్రభుత్వం విజయడైరీ అధికారులు, ( మంత్రి స్థాయి) ప్రజా ప్రతినిధులు కలిసి ప్రైవేటు డైరీల యాజమాన్యాలు ఇచ్చే మామూళ్లకు ఆశపడి ప్రైవేటు డైరీలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ సంస్థ విజయ డైరీ‌ని విస్మరిస్తున్నారని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాడి రైతులను ప్రోత్సహించి విజయ డైరీ ని కాపాడుకోవాలని కోరుతున్నారు.

కనీస ధర రూ.40 చెల్లించాలి

సాదం రమేష్, పాల శీతలీకరణ కేంద్రం చైర్మన్, కృష్ణాజీ గూడెం, పాలు ఉత్పత్తి చేసే పాడి రైతులకు లీటరు ధర రూ.40 కనీస ధర గా నిర్ణయించాలి. అందులో బర్రె పాలకు రూ.40, ఆవు పాలకు రూ.38 ఇవ్వాలి. 15 రోజులకు చెల్లించే బిల్లుతో ఇన్సెంటివ్‌ను అందించాలి. ప్రైవేటు సంస్థలకు అందించే ఇన్సెంటివ్ నిలిపివేసి విజయ డైరీ‌కి పాలు పోసే రైతులను ప్రోత్సహించాలి.

నాణ్యత లేదు – సకాలంలో రాదు

విజయ డైరీ‌కి పాలు పోసే రైతులకు సబ్సిడీపై ఇచ్చే దాన ( మినరల్ మిక్చర్) సకాలంలో రాదు, వచ్చినా నాణ్యత లేదు. పాల ధర ప్రతి ఏటా రూ.1.50 పెంచాలి కానీ పెంచడం లేదు. రూ.4 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వడం లేదు. రైతులకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలి.

భూక్య శ్రీను, ఫతేపూర్..

ప్రైవేటుకు ఇచ్చినప్పుడు మాకెందుకు ఇయ్యరు

ప్రైవేటు పాల సేకరణ కంపెనీలకు ఇన్సెంటివ్ ఇస్తున్న ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీ‌కి పాలు పోసే రైతులకు ఇన్సెంటివ్ ఎందుకు ఇయ్యరు. పాడి రైతులను ప్రోత్సహించి ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సెంటివ్, రుణ సౌకర్యాలు, సబ్సిడీలు అందించాల్సి ఉంది.

భూక్య రమేష్, గార్ల గడ్డ తండా



Next Story

Most Viewed