‘ధనుష్ 43’ ఫోర్త్ సాంగ్ రికార్డింగ్

by  |
‘ధనుష్ 43’ ఫోర్త్ సాంగ్ రికార్డింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ కాంబినేషన్‌‌కు ఫ్యాన్ బేస్ కొంచెం ఎక్కువే. ఇక ధనుష్ 43వ చిత్రానికి సంగీతం అందిస్తున్న జీవీ.. లేటెస్ట్‌గా మ్యూజిక్ ఆల్బమ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే మూడు సాంగ్స్ పూర్తి కాగా.. నాలుగో పాట రికార్డింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. సాంగ్స్ అద్బుతంగా వస్తున్నాయని.. మీ అందరికీ వినిపించేందుకు సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉన్నానని తెలిపాడు. సాలిడ్ ఆల్బమ్‌ను వినేందుకు రెడీ అయిపోమని చెప్పారు.

కార్తీక్ నరేన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. మాళవిక మోహనన్ ఫీమేల్ లీడ్‌గా సెలెక్ట్ అయింది. కాగా ఈ నెలలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ధనుష్ ‘అత్రంగి రే’ ఫైనల్ షెడ్యూ్ల్ పూర్తి చేసే పనిలో ఉండగా.. తర్వాత ‘ధనుష్ 43’ షూటింగ్‌లో జాయిన్ కానున్నారు.



Next Story