ఎంపీ గురుమూర్తికి సైబర్ సెగ.. ఏకంగా నాలుగు కోట్ల డిమాండ్..

84

దిశ, వెబ్ డెస్క్: సైబర్ కేటుగాళ్లు ఎవరినీ వదలడం లేదు. ఏకంగా తిరుపతి ఎంపీ గురుమూర్తికి ఫోన్ చేశారు. తన పేరు అభిషేక్ అని తాను సీఎంఓ ఆఫీస్ లో పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఖాదీ పరిశ్రమ సబ్సిడీ కింద ఐదు కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపాడు. అక్కడితో ఆగకుండా ఆ డబ్బులు జమ చేయాలి అంటే తనకు కొంత మొత్తం ఇవ్వాలని డీలింగ్ మాట్లాడాడు.

అయితే అభిషేక్ మొదట తనకు డబ్బు వేస్తేనే మంజూరు చేస్తానని, మొత్తం 25 ధరఖాస్తులకు ఒక్కొక్క దానికి 1.5 లక్షలు చేల్లించాలని డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన ఎంపీ సీఎంఓ ఆఫీస్ కు కాల్ చేసి సంబందిత వ్యక్తి వివరాలను ఎంక్వైరీ చేశాడు. అయితే ఆ పేరు మీద ఎవరూ సీఎంఓ లో పనిచేయడం లేదని సీఎంఓ అధికారులు తెలిపారు. దాంతో ఒక్క సారిగా ఎంపీ షాక్ కు గురి అయ్యడు.