లేటెస్ట్ కరెంట్ అఫైర్స్

by Disha Web Desk 17 |
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్
X

అందుబాటులోకి కొవిడ్ 19 వ్యాక్సిన్ ఇన్‌కొవ్యాక్:

కొవిడ్ - 19 వ్యాధికి నాసికా టీకా ఇన్‌కొవ్యాక్ దేశీయంగా అందుబాటులోకి వచ్చిది.

కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమక్షంలో కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఢిల్లీలో ఈ టీకాను విడుదల చేశారు.

కరోనాకు ప్రపంచంలోనే ఇదే తొలి నాసికా టీకా, దీన్ని ఆవిష్కరించిన ఘనత హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కు దక్కింది.

ఇన్ కొవ్యాక్ టీకాను 2 ప్రాథమిక డోసులకు, బూస్టర్ డోసుకూ వినియోగించవచ్చు. ఈ టీకాకు ప్రైవేట్ మార్కెట్లో ఒక డోసుకు రూ. 800 ధర నిర్ణయించారు.

ప్రభుత్వానికి రూ. 350కే లభిస్తుంది. తాజాగా కొవిన్ పోర్టల్ లో దీనిని పొందుపరిచారు.

వాషింగ్టన్ యూనివర్సిటీ అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ బయోటిక్ ఈ టీకాను అభివృద్ధి చేసింది.

విశాఖ రైల్వే స్టేషన్ కు హరిత గుర్తింపు:

తూర్పు కోస్తా రైల్వే జోన్ లోని వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ మరో గుర్తింపు సాధించింది.

ఇటీవల ఈట్ రైట్ స్టేషన్ గా ఎంపికవ్వగా ఇప్పుడు అత్యుత్తమ రేటింగ్ తో గ్రీన్ రైల్వే స్టేషన్ గా ధ్రువీకరణ సొంతం చేసుకుంది.

పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే విధానాలను సమర్థంగా అడ్డుకునేలా సొంతం చేసుకుంది.

పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే విధానాలను సమర్థంగా అడ్డుకునేలా నిర్వహణ కొసాగిస్తే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఈ గుర్తింపు ఇస్తుంది.

కాలుష్య కారకాలను తగ్గించే 6 పర్యావరణ విభాగాల్లో విశాఖపట్నం 100కి 82 పాయింట్లు సాధించింది. దీంతో ఈ ధ్రువీకరణ పొందిన స్టేషన్లలో విశాఖకూడా ఒకటిగా నిలిచింది.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో ఏపీకి 5 అవార్డులు:

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) కార్యక్రమ నిర్వహణలో రాష్ట్రానికి మూడు విభాగాల్లో 6 జాతీయ అవార్డులు లభించాయని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అధికారులు ఈ అవార్డులు స్వీకరించనున్నారు.

ప్రతి లక్ష జనాభాకు సంబంధించి అత్యధిక హెల్త్ రికార్డులను ఏబీహెచ్ఏ (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అథారిటీ)తో అనుసంధానం చేయడంలో ఏపీ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాల స్థాయిలో ఏలూరు, విశాఖపట్నం, పల్నాడు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఏబీహెచ్ఏ ఖాతాల ఏర్పాటుతో ఏడీబీఏం కింద వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి విశిష్ట గుర్తింపు సంఖ్య కేటయింపు, ఇతర చర్యల్లోనూ రాష్ట్రం ముందంజలో ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.



Next Story

Most Viewed