కరోనా స్ట్రెయిన్… మహారాష్ట్రలో కర్ఫ్యూ విధింపు

by  |
కరోనా స్ట్రెయిన్… మహారాష్ట్రలో కర్ఫ్యూ విధింపు
X

దిశ, వెబ్‌డెస్క్: యూకేలో కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభణతో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రేపటి నుంచి జనవరి 5 వరకు మహారాష్ట్రలోని అర్బన్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటన చేసింది. రాత్రి 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. అదేవిధంగా యూరప్ నుంచి వచ్చే ప్రయాణికులు 14రోజులు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేసింది. యూకేలో కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు యూకేకు విమాన సర్వీసులు రద్దు చేశాయి. మన దేశం నుంచి కూడా రేపు అర్థరాత్రి నుంచి డిసెంబర్ 31వరకు ఆదేశానికి విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేశారు.



Next Story

Most Viewed