స‌మ‌గ్ర పంట‌ల‌కు ఖ‌మ్మం కేరాఫ్ కావాలి: పువ్వాడ

by  |
స‌మ‌గ్ర పంట‌ల‌కు ఖ‌మ్మం కేరాఫ్ కావాలి: పువ్వాడ
X

దిశ‌, ఖ‌మ్మం: సమగ్ర పంటలకు ఖ‌మ్మం జిల్లా కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌వాల‌ని రాష్ట్ర ర‌వాణాశాఖ మంత్రి అజ‌య్‌కుమార్ అన్నారు. నియంత్రిత వ్య‌వ‌సాయ విధానంతోనే వ్య‌వ‌సాయం లాభ‌సాటిగా మారుతుంద‌ని అన్నారు. ఖ‌మ్మం జిల్లా నేల‌కొండ‌ప‌ల్లి మండ‌లం ముజ్జుగూడెం గ్రామ పంచాయతీ ఆవరణంలో శ‌నివారం నియంత్రిత వ్య‌వ‌సాయ విధానంపై రైతులకు అవగాహన క‌ల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు లాభసాటిగా వ్యవసాయం చేసుకోవాలన్నదే ప్రభుత్వ ధ్యేయమ‌న్నారు. ఈ సారి మొక్క‌జొన్న‌కు ప్రత్యామ్నాయంగా కందులు, పత్తి, తెలంగాణ సోనా, వ‌రి వంగ‌డం సాగు చేయాల‌ని ప్ర‌భుత్వం సూచిస్తోంద‌ని తెలిపారు. అంత‌కుముందు గ్రామంలో నిర్మించిన వైకుంఠ ధామంను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర రావు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, రైతులు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.



Next Story