మానవత్వం చాటుకున్న CRPF అధికారి.. ప్రశంసిస్తున్న నెటిజన్లు

by Sridhar Babu |
CRPF-Sandeep-kumar
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఓ సీఆర్‌పీఎఫ్ అధికారి మానవత్వంతో చేసిన సహాయం ఓ గిరిజన వృద్ధురాలి ప్రాణం కాపాడింది. తీవ్ర అనారోగ్యంతో సుక్మా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న గిరిజన మహిళ సోయం చిన్నక్క(65)కి ఓ నెగెటివ్ బ్లడ్ అత్యవసరమని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టు చూసిన సీఆర్‌పీఎఫ్ 74వ బెటాలియన్ సెకండ్ కమాండెంట్ సందీప్ కుమార్ నీరజ్ స్పందించారు.

తను ఉన్న దోర్నపాల్ నుంచి 36 కి.మీ దూరంలోని సుక్మా ఆసుపత్రికి వెళ్లి ఆ వృద్ధురాలికి బ్లడ్ ఇచ్చి ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పి వచ్చారు. సమయానికి రక్తం ఎక్కించడంతో ప్రాణాపాయం తప్పిందని చిన్నక్క కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. రక్తదానం చేసిన సీఆర్‌పీఎఫ్ అధికారికి చిన్నక్క కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వం చూపించిన సీఆర్‌పీఎఫ్ అధికారిని పలువురు ప్రశంసిస్తున్నారు.



Next Story

Most Viewed