అప్పుడే సిమెంట్ పరిశ్రమ వృద్ధి: క్రిసిల్

by  |
అప్పుడే సిమెంట్ పరిశ్రమ వృద్ధి: క్రిసిల్
X

దిశ, వెబ్‌డెస్క్: సిమెంట్ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 13 శాతం వృద్ధిని సాధిస్తుందని, దేశీయంగా మౌలిక సదుపాయాలు, పట్టణ గృహాల డిమాండ్ పునరుజ్జీవనం వల్ల ఈ వృద్ధి నమోదవుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. అయితే, పెరిగే అమ్మకాల పరిమాణం.. తిరిగి విద్యుత్, ఇంధన వ్యయాలపై పడుతుందని క్రిసిల్ వివరించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వ్యయం సిమెంట్ లాభదాయకతపై ఆధారపడి ఉంటుందని క్రిసిల్ అభిప్రాయపడింది. ముడి పదార్థాలైన డీజిల్, బొగ్గు, పాలిప్రొఫైలిన్ బ్యాగుల ధరలు టన్నుకు రూ. 150-రూ. 200 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఇది మొత్తం సిమెంట్ అమ్మకాల వ్యయంలో సుమారు 55 శాతం ఉంటుందని క్రిసిల్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో పరిశ్రమ 31 శాతం ప్రతికూలత నుంచి వేగంగా కోలుకుందని, ఈ మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఇది 1-2 శాతం ప్రతికూలతకు పరిమితం అవ్వొచ్చని క్రిసిల్ తెలిపింది. ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సమవాత్సానికి బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా కీలకమైన గృహ నిర్మాణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సకాలంలో నిధులను అందించడం ద్వారా డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నట్టు క్రిసిల్ వెల్లడించింది.

Next Story

Most Viewed