పెళ్లికి వచ్చి రసగుల్లా కోసం కొట్టుకున్న అతిథులు.. ఆరుగురి పరిస్థితి విషమం

by Disha Web Desk 7 |
పెళ్లికి వచ్చి రసగుల్లా కోసం కొట్టుకున్న అతిథులు.. ఆరుగురి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి మండపంలో గొడవలు సహజం. ఇంటికి వచ్చిన అతిథులను సరిగ్గా పట్టించుకోలేదనో, విందులో అడిగినవి వడ్డించలేదనో గొడవలకు దిగుతారు. అయితే.. కొన్ని గొడవలు సరదాగా ఉన్నప్పటికీ మరికొన్ని మాత్రం ప్రమాదాలకు దారితీస్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే యూపీలో జరిగింది. ఓ పెళ్లి వేడుకలో రసగుల్లా స్వీట్ కోసం బంధువులు గొడవకు దిగారు. ఒకరిమీద మరొకరు దాడి చేసుకోవడంతో ఆరుగురుకి తీవ్రంగా గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆగ్రాలోని బ్రిజ్‌బన్ కుష్వాహాలో ఆదివారం ఓ పెళ్లి వేడుకలో భోజనాల తంతు జరుగుతోంది. అందరూ ఎంతో సంతోషంగా భోజనాలు చేసి వధువరులను ఆశీర్వదించి వెళ్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి రసగుల్లా స్వీట్ అయిపోయింది అంటూ గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. దీంతో గొడవ స్టార్ట్ అయింది. విందులో రసగుల్లా వడ్డించలేదని నానా హంగామా చేశారు అతిథులు. చిన్నగా మొదలైన గొడవ చివరకు పెద్దదై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి.. గొడవకు కారణమైన వాళ్లను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story