దారుణం.. ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి ఉరేసుకున్న తండ్రి

by Disha Web Desk 9 |
దారుణం.. ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి ఉరేసుకున్న తండ్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తి తన ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి తాను ఆత్మహత్య చేసుకొన్న ఘోరమైన ఘటన కేరళలోని కొట్టాయం జిల్లా పాల సమీపంలోని రామాపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్లే.. 40 ఏళ్ల జోమోన్ భార్య గతకొంతకాలం క్రితం విడిచిపెట్టింది. అప్పటి నుంచి తన ముగ్గురు కూమార్తెలైన అనన్య(13), అమేయ(10), అనామిక(7)లతో కలిసి నివసిస్తున్నారు. కాగా, ఈ క్రమంలో జమోన్ సోమవారం అర్ధరాత్రి 12.30 నిమిషాలకు.. తన కూమార్తెలను గొంతు కోసి.. అనంతరం అదే ఇంట్లో అతడు ఉరి వేసుకుని మరణించాడు.

ఈ ఘటనను గమనించిన స్థానికులు, రక్తపు మడుగులో ఉన్న పిల్లలను కొట్టాయం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్న కూతురు అనామిక పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. జోమోన్ ఆత్మహత్య చేసుకోవడానికి, తన కూతుళ్లపై ఇంతటి దారుణానికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed